కొండపోచమ్మ ఆలయ హూండీ లెక్కింపు..

by Kalyani |
కొండపోచమ్మ ఆలయ హూండీ లెక్కింపు..
X

దిశ, జగదేవపూర్: సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలంలోని తీగుల్ నర్సాపూర్ సమీపంలోని అత్యంత ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ కొండపోచమ్మ అమ్మవారి ఆలయ హూండీని దేవాదాయ, ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో బుధవారం లెక్కించారు. భక్తులు వివిధ కానుకల రూపంలో అమ్మవారికి హూండీలో డబ్బులు వేసి ముడుపులు చెల్లించుకున్నారు. అమ్మవారికి 34 రోజులకు గాను రూ.9,59,357 హూండీ ద్వారా ఆదాయం వచ్చినట్లు దేవాదాయశాఖ సూపరింటెండెంట్ శివకుమార్, ఆలయ చైర్మన్ జంబుల శ్రీనివాస్ రెడ్డి, ఆలయ ఈఓ మోహన్ రెడ్డి తెలిపారు.

అమ్మవారికి కానుకల రూపంలో వచ్చిన ఆదాయాన్ని అమ్మవారి ఆలయ ఖాతాలో జమ చేయనున్నట్లు తెలిపారు. అమ్మవారి జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని వసతులను కల్పిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రజిత రమేష్, ఎంపీటీసీ కావ్య దర్గయ్య, పాలక మండలి సభ్యులు కుమ్మరి కనకయ్య, ఆలయ సిబ్బంది వెంకట్ రెడ్డి, కనకయ్య, పూజారులు మల్లయ్య, లక్ష్మణ్, కొండయ్య, తిరుపతి, గోవర్దన్ తదితరులు ఉన్నారు.

Next Story

Most Viewed