నా పని అయిపోలేదు.. తమిళనాడులో అమ్మ పాలన తీసుకొస్తానని శశికళ సంచలన వ్యాఖ్యలు

by Mahesh |
నా పని అయిపోలేదు.. తమిళనాడులో అమ్మ పాలన తీసుకొస్తానని శశికళ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: 2024 పార్లమెంట్ ఎన్నికల అనంతరం తమిళనాడు రాష్ట్రంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలో తమిళ రాజకీయ రంగంలోకి మాజీ సీఎం జయలలిత సహచరిణి శశికళ ప్రవేశించారు. చెన్నై వేదికగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. నా పని ఇంకా అయిపోలేదు. ఇప్పుడు మొదలైంది. 2026 జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో అన్నా డీఎంకే పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి.. రాష్ట్రంలో అమ్మ జయలలిత పాలనను నడిపిస్తానని శశికళ వ్యాఖ్యానించారు. దీంతో కొన్ని రోజులు రాజకీయాలపై సైలెంట్ గా ఉన్న ఆమె మీడియా ముందుకు వచ్చి ఈ వ్యాఖ్యలు చేయడంతో ఒక్కసారిగా తమిళ రాజకీయ పార్టీలు ఉలిక్కిపడ్డాయి. ముఖ్యంగా దివంగత నేత అయిన మాజీ సీఎం జయలలిత వారసురాలిగా ఉన్న శశికళ కొన్ని కేసుల కారణంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే.Next Story

Most Viewed