త్యాగానికి ప్రతీక బక్రీద్..ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు, రేవంత్ రెడ్డి

by Jakkula Mamatha |
త్యాగానికి ప్రతీక బక్రీద్..ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు, రేవంత్ రెడ్డి
X

దిశ,వెబ్‌డెస్క్: ప్రపంచ వ్యాప్తంగా ముస్లింలందరూ రంజాన్ పండుగ తరువాత అత్యంత ఇష్టంగా జరుపుకునే పండుగ బక్రీద్. దైవారాధన ప్రవక్త త్యాగనిరతిని గుర్తు చేసుకుంటూ అల్లాహ్ ప్రవక్తను, త్యాగాలకు ప్రతీకగా బక్రీద్‌ను భక్తి శ్రద్ధలతో నేడు (సోమవారం) జరుపుకుంటున్నారు. మానవాళిలో ఆవహించి ఉన్న పశుత్వాన్ని నిర్మూలించడం దైవానికి ప్రీతికరం అని చెప్పడమే బక్రీద్ అంతరార్థం. బక్రీద్ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ముస్లింలకు సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. త్యాగనిరతిని వ్యాపింప చేయడమే బక్రీద్ ఉద్దేశం అన్నారు. అన్ని గుణాల కంటే దానగుణమే ఉత్తమమన్నది పండుగ సారాంశం. హజ్రత్ ఇబ్రహీం త్యాగనిరతిని స్మరించుకుంటూ పండుగ జరుపుకుంటున్న ముస్లింలకు శుభాకాంక్షలు అని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు. త్యాగానికి ప్రతీక బక్రీద్..ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు అని సీఎం రేవంత్ అన్నారు.Next Story

Most Viewed