కేటీఆర్‌తో జగ్గారెడ్డి భేటీ.. ప్రాధాన్యత సంతరించుకున్న ఇద్దరి సంభాషణ

by Mahesh |
కేటీఆర్‌తో జగ్గారెడ్డి భేటీ.. ప్రాధాన్యత సంతరించుకున్న ఇద్దరి సంభాషణ
X

దిశ, డైనమిక్ బ్యూరో: మంత్రి కేటీఆర్ తో కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి భేటీ కావడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మంత్రి కేటీఆర్ చాంబర్‌లో ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జగ్గారెడ్డితో టీఎన్‌టీవో రాష్ట్ర అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ కూడా ఉన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్, జగ్గారెడ్డి, మామిళ్ల రాజేందర్ మధ్య ఆసక్తికర చర్చ జరిగింది.

మీ ఇద్దరి దోస్తాన్ ఎక్కడ కుదిరిందని కేటీఆర్ అడగగా మాది ఒకే కంచం, ఒకే మంచం అని మామిళ్ల బదులిచ్చారు. అయితే జగ్గారెడ్డిని గెలిపిస్తావా అని కేటీఆర్ ప్రశ్నించగా సంగారెడ్డిలో జగ్గారెడ్డిని గెలిపిస్తా.. మన దగ్గరకు పట్టుకువస్తానని మామిళ్ల రాజేందర్ కేటీఆర్‌తో చెప్పారు. ఈ సంభాషణ రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది. జగ్గారెడ్డి పార్టీ మారబోతున్నారని ప్రచారం జరుగుతున్న వేళ ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.

Read More : కేసీఆర్ ఇచ్చిన స్ట్రోక్‌తో విపక్షాలు గిలగిల: T. Harish Rao

Next Story

Most Viewed