మా ఆయన ఫెయిల్యూర్ హీరో కాదు.. స్టేజిపై ఎమోషనల్ అయిన వితిక షేరు..

by Kavitha |
మా ఆయన ఫెయిల్యూర్ హీరో కాదు.. స్టేజిపై ఎమోషనల్ అయిన వితిక షేరు..
X

దిశ, సినిమా: హీరో వరుణ్ సందేశ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హ్యాపీ డేస్, కొత్త బంగారు లోకం, కుర్రాడు, మరో చరిత్ర వంటి సినిమాల్లో నటించి హిట్ కొట్టిన విషయం తెలిసిందే. ఇంకా కెరీర్‌లో దూసుకపోతాడు అనుకంటే అనుకున్న రీతిలో ఆఫర్లు రాక సినిమాలకు దూరం అయ్యాడు. మళ్లీ కొంత గ్యాప్ తర్వాత బిగ్‌బాస్‌ షోలోకి ఎంట్రీ ఇచ్చి అక్కడ మెప్పించి ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇప్పుడు సినిమాల్లో రీ ఎంట్రీ ఇచ్చి వరుస మూవీలతో దూసుకుపోతున్నాడు.

ఈ క్రమంలోనే ‘నింద’ అనే థ్రిల్లర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు వరుణ్ సందేశ్. ది ఫర్వెంట్ ఇండీ ప్రొడక్షన్ బ్యానర్ పై రాజేష్ జగన్నాథం నిర్మాతగా, దర్శకుడిగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. నింద సినిమా జూన్ 21న విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. అయితే ఈ ఈవెంట్‌లో నిఖిల్ గెస్ట్‌గా వచ్చాడు. అలాగే వరుణ్ సందేశ్ భార్య నటి వితిక షేరు కూడా వచ్చింది. అయితే వరుణ్ కెరీర్‌లో ఎక్కువ ఫ్లాప్ సినిమాలే చూశాడు, మధ్యలో కొన్నాళ్ళు సినిమాలకు గ్యాప్ ఇచ్చాడు కదా అని అడిగిన ప్రశ్నకు వితిక షేరు స్పందించింది.

ఆమె మాట్లాడుతూ.. చాలా మంది ఇలా వరుణ్‌ని ఫెయిల్యూర్ హీరో అంటున్నారు. ఏ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి ఆల్మోస్ట్ 17 ఏళ్లుగా ఇండస్ట్రీలోనే ఉంటూ సినిమాలు తీస్తూ ఉన్నాడు. ఇక్కడ ఫెయిల్ అయితే నాకు వద్దు అని అన్ని సర్దేసుకొని వెళ్లిపోయేవాళ్లే ఫెయిల్ అయినట్టు. ఫ్లాప్స్ రాగానే సినిమాలు వదిలేసి వెళ్లిపోయేవాళ్లు ఫెయిల్ యాక్టర్స్. మా ఆయన అలా వెళ్లిపోలేదు. మా ఆయన ఫెయిల్యూర్ యాక్టర్ కాదు అని చెప్తూ స్టేజిపై ఎమోషనల్ అయింది. దీంతో తన భర్తకు ఎంత బాగా సపోర్ట్ చేస్తుందో అని వితికపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతుంది.

Advertisement

Next Story

Most Viewed