క్యూర్, ప్యూర్, రేర్ మోడల్‌తో తెలంగాణ ముందుకెళ్తోంది: భట్టి విక్రమార్క

by Ajay Maddhiboyina |   (  Updated:2025-12-08 11:21:48  IST  )

క్యూర్, ప్యూర్, రేర్ మోడల్ తో తెలంగాణ ముందుకెళ్తోందని డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క అన్నారు. తెలంగాణ రైజింగ్ గ్లోబ‌ల్ స‌మ్మిట్ లో ఆయ‌న మాట్లాడుతూ.

క్యూర్, ప్యూర్, రేర్ మోడల్‌తో తెలంగాణ ముందుకెళ్తోంది: భట్టి విక్రమార్క
X

దిశ‌, వెబ్ డెస్క్: క్యూర్, ప్యూర్, రేర్ మోడల్ తో తెలంగాణ ముందుకెళ్తోందని డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క అన్నారు. తెలంగాణ రైజింగ్ గ్లోబ‌ల్ స‌మ్మిట్ లో ఆయ‌న మాట్లాడుతూ.. ఆశ‌యం లేకుండా తెలంగాణ ఎప్పుడూ లేద‌న్నారు. కానీ ఆశ‌యాన్ని చాలా కాలంపాటు స‌మ‌గ్ర ధృక్పథంతో కొన‌సాగించ‌లేద‌న్నారు. కాంగ్రెస్ ప్ర‌భుత్వానికి ఒక ఇంటిగ్రేటెడ్ ఫ్రేమ్ వ‌ర్క్ ఉంద‌న్నారు.

త‌మ ల‌క్ష్యం కేవ‌లం వ‌చ్చే ఏడాదికో, వ‌చ్చే ఎన్నిక‌ల నాటికో పెట్టుకోలేద‌ని 2047కు పెట్టుకున్నామ‌న్నారు. మూడు ట్రిలియ‌న్ డాల‌ర్ల ఎకానమినీ సృష్టిస్తామ‌ని చెప్ప‌డం కేవ‌లం స్లోగ‌న్ కాద‌ని అంచ‌లంచెలుగా దాన్ని చేరుకుంటామ‌న్నారు. అనుకున్న లక్ష్యాన్ని చేరుకునేందుకు ప్ర‌ణాళిక ఉంద‌న్నారు. స‌మ్మిళిత వృద్ధి కోసం వెన‌క్కిత‌గ్గ‌కుండా ప‌నిచేసే క‌మిట్ మెంట్ తో ప‌నిచేస్తామ‌ని చెప్పారు. రాష్ట్రంలో భ‌విష్యత్ త‌రాల‌కు ఉప‌యోగ‌ప‌డేలా ప్ర‌తి ఇన్నోవేష‌న్ ఉంటుందని అన్నారు.

Read More...

పెట్టుబడులకు తెలంగాణ బెస్ట్ డెస్టినేషన్: మంత్రి శ్రీధర్ బాబు

ప్రపంచ దేశాలతో తెలంగాణ పోటీ పడుతోంది.. గ్లోబ‌ల్ స‌మ్మిట్‌లో డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు

TG: గ్లోబల్ సమ్మిట్‌లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

CM Revanth Reddy: అన్‌స్టాపబుల్‌ గా తెలంగాణ రైజింగ్‌ : సీఎం రేవంత్ రెడ్డి

Next Story