- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని యువకుడి పై యువతి బంధువుల దాడి
ప్రేమ వివాహం చేసుకున్న యువకుడిని వెతికి మరీ చితకబాదడంతో పాటు తీవ్రంగా గాయపరిచి, యువతిని బలవంతంగా తమ వెంట తీసుకెళ్లిన ఘటన బాలానగర్ మండలంలో చోటుచేసుకుంది.

దిశ, జడ్చర్ల / బాలానగర్ : ప్రేమ వివాహం చేసుకున్న యువకుడిని వెతికి మరీ చితకబాదడంతో పాటు తీవ్రంగా గాయపరిచి, యువతిని బలవంతంగా తమ వెంట తీసుకెళ్లిన ఘటన బాలానగర్ మండలంలో చోటుచేసుకుంది. ఈ దాడి ఘటనపై బాలానగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. బాలానగర్ పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం నాగర్‌కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండలం వెంకటాయపల్లి గ్రామానికి చెందిన కొత్త ప్రశాంత్ (26) తన అమ్మమ్మ ఊరైన ఎదిరేపల్లిలో గత ఏడాది నుంచి నివాసం ఉంటూ ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన లిడియా అనే యువతితో ప్రేమలో పడ్డాడు. యువతి, యువకుడు ఇద్దరూ కలిసి ఈ నెల 14న తిరుపతిలో ప్రేమ వివాహం చేసుకున్నారు. అనంతరం బాలానగర్ మండలంలోని గాలిగూడెంలో నివాసం ఉంటున్న తన బావ ఇంటికి ఈ నెల 17న చేరుకుని అక్కడ తలదాచుకున్నారు.
వీరు గాలిగూడెంలో ప్రశాంత్ బావ ఇంటి వద్ద తలదాచుకున్న విషయం తెలుసుకున్న యువతి బంధువులైన తాండూరు మండలం బలన్‌పల్లికి చెందిన నాగార్జునతో పాటు మరో ఇద్దరు యువకులు అదే రోజు రాత్రి గాలి గూడెం గ్రామానికి చేరుకుని యువతిని తమ వెంట బలవంతంగా తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. వారిని ప్రశాంత్ అడ్డుకునే ప్రయత్నం చేయడంతో ముగ్గురు వ్యక్తులు ప్రశాంత్‌పై కట్టెలతో విచక్షణారహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ప్రశాంత్ బావతో పాటు అక్కడ ఉన్న ఇరుగుపొరుగు వారు ఈ దాడిని అడ్డుకునే ప్రయత్నం చేయగా, వారిపై కూడా దాడి చేసి గాయపరిచిన అనంతరం యువతి లిడియాను బలవంతంగా తమ వెంట తీసుకెళ్లారు. దీంతో స్థానికులు తీవ్రంగా గాయపడిన ప్రశాంత్‌ను జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ ఘటనపై ప్రశాంత్ బాలానగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు బాలానగర్ పోలీసులు తెలిపారు.






