- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కేరళ స్కూల్ యాజమాన్యంపై వెంటనే చర్యలు తీసుకోవాలి.. తెలంగాణ మాదిగ హక్కుల దండోరా డిమాండ్
కేరళ స్కూల్ యాజమాన్యం తీరుపై తెలంగాణ మాదిగ హక్కుల దండోరా కరీంనగర్ జిల్లా అధ్యక్షులు పుల్లూరి కుమార్ మాదిగ ఆగ్రహం వ్యక్తం చేశారు.

దిశ, జమ్మికుంట: కేరళ స్కూల్ యాజమాన్యం తీరుపై తెలంగాణ మాదిగ హక్కుల దండోరా కరీంనగర్ జిల్లా అధ్యక్షులు పుల్లూరి కుమార్ మాదిగ ఆగ్రహం వ్యక్తం చేశారు. జమ్మికుంట తాసిల్దార్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆయన ఎమ్మార్వోకు ఫిర్యాదు అందజేశారు. పుల్లూరి కుమార్ మాదిగ మాట్లాడుతూ... కేరళ స్కూల్లో చదువుతున్న విద్యార్థులు కొన్ని కారణాల వల్ల చదువు మానేసి ప్రభుత్వ పాఠశాలల్లో చేరడానికి వెళ్తున్నారు. అయితే ఆ విద్యార్థులకు స్కూల్ నుంచి ఇవ్వవలసిన టీసీ, సర్టిఫికెట్లు మరియు ఇతర సంబంధిత పత్రాలను యాజమాన్యం ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తుందని ఆరోపించారు. దీంతో పిల్లల విద్యకు అంతరాయం ఏర్పడుతోందని, పేద తల్లిదండ్రులు ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారని తెలిపారు.అధికారులు వెంటనే జోక్యం చేసుకుని కేరళ స్కూల్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు వెంటనే సర్టిఫికెట్లు ఇప్పించి వారి విద్య కొనసాగేలా చూడాలని కోరారు. విద్యార్థుల హక్కులను కాలరాస్తే ఉద్యమాలు చేస్తామని ఆయన హెచ్చరించారు.






