- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలుగు రాష్ట్రాల ప్రజలకు అలర్ట్.. నేడు అత్యంత భారీ వర్షాలు
తెలుగు రాష్ట్రాల ప్రజలకు అలర్ట్.. నేడు అత్యంత భారీ వర్షాలు పడనున్నాయి.

దిశ, వెబ్ డెస్క్: తెలుగు రాష్ట్రాల ప్రజలకు బిగ్ అలర్ట్. ఇవాళ ఏపీ అటు తెలంగాణలో వర్షాలు పడనున్నాయి. నిన్న రాత్రి నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు దంచి కొడుతున్నాయి. ఇవాళ ఉదయం 10 గంటల వరకు తెలంగాణ రాష్ట్రంలోని ఆసిఫాబాద్, మంచిర్యాల, ఆదిలాబాద్, నిజామాబాద్, జగిత్యాల, భూపాలపల్లి, కొత్తగూడెం, ములుగు, సంగారెడ్డి, రాజన్న సిరిసిల్ల, మెదక్, కామారెడ్డి జిల్లాలో వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ స్పష్టం చేసింది.
పశ్చిమ మధ్య బంగాళాఖాతం, ఉత్తర కోస్తాంధ్రపై ఉన్న ఉపరితల ఆవర్తన ప్రభావం ఉన్నట్లు APSDMA పేర్కొంది. ఈ క్రమంలో నేడు శ్రీకాకుళం, మన్యం, అల్లూరి, పోలవరం, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరికల జారీ చేశారు అధికారులు. అలాగే మిగతా జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.






