- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
4 గంటల వరకే పని.. సగం జీతమే ఇవ్వండి: ఐఏఎస్ అధికారి వినూత్న లేఖ!
తనకు సగం జీతం మాత్రమే చెల్లించాలని కోరుతూ ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి సీఎస్‌కు లేఖ రాయడం సంచలనంగా మారింది.

దిశ, వెబ్ డెస్క్: తనకు సగం జీతమే ఇవ్వాలని కోరుతూ ఓ ఐఏఎస్ అధికారి రాసిన వినూత్న లేఖ సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది. యూపీకి చెందిన తనకు రోజుకు కేవలం 4 గంటల వరకే పని ఉంటోందని, అందువల్ల తనకు సగం జీతం మాత్రమే చెల్లించాలని కోరుతూ ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి రింకూ సింగ్ రాహీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి (CS) రాసిన లేఖ సంచలనం సృష్టిస్తోంది. 2023 బ్యాచ్‌కు చెందిన ఆయన ప్రస్తుతం జలౌన్ సబ్ డివిజినల్ మేజిస్ట్రేట్ (SDM) గా పనిచేస్తున్నారు.
రాష్ట్రంలో పనిచేసే అర్హత తనకు లేదని ప్రభుత్వం భావిస్తే వెంటనే బదిలీ చేయాలని, ఒకవేళ అర్హత ఉంటే ఇతర అధికారులతో సమానంగా పూర్తిస్థాయి విధులు అప్పగించాలని ఆయన లేఖలో విజ్ఞప్తి చేశారు. తన పరిధిలో జరిగిన అక్రమ మైనింగ్, భూ కబ్జాలపై ఎవరి ఒత్తిళ్లకు లొంగకుండా కఠినంగా వ్యవహరించడం వల్లే తనను పక్కనపెట్టి తక్కువ బాధ్యతలు ఇచ్చారని రింకూ సింగ్ తెలిపారు. ఒక ఐఏఎస్ అధికారి ప్రభుత్వంలో పూర్తిస్థాయి పని లేనందున సగం జీతమే ఇవ్వాలని, వేరే చోటికి మార్చాలని కోరడం పరిపాలనా వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.






