- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కార్యకర్తలు మొక్కిన మొక్కులను నెరవేర్చిన ఎమ్మెల్యే దంపతులు..
తలకొండపల్లి మండలం గట్టు ఇప్పలపల్లి శివారులోని బండలగడ్డ శ్రీ ఆంజనేయస్వామి దేవాలయంలో కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, ఆయన సతీమణి మాధవి నారాయణరెడ్డి దంపతులు వందలాది మంది కార్యకర్తలతో కలిసి యజ్ఞమహోత్సవం, సత్యనారాయణ స్వామి వ్రతంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

దిశ, తలకొండపల్లి : తలకొండపల్లి మండలంలోని గట్టు ఇప్పలపల్లి గ్రామ శివారు ప్రాంతంలో ఉన్న బండలగడ్డ శ్రీ ఆంజనేయస్వామి దేవాలయంలో కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, ఆయన సతీమణి మాధవి నారాయణరెడ్డి దంపతులు మంగళవారం పూజారులు రాజాపంతులు, శరత్ చంద్రశర్మ, శ్రీనివాసా మూర్తి శర్మలు యజ్ఞమహోత్సవం, సత్యనారాయణ స్వామి వ్రతం కార్యక్రమాలను వందలాది మంది కార్యకర్తలతో కలిసి భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. 2023 డిసెంబర్‌లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కసిరెడ్డి నారాయణరెడ్డి విజయం సాధించాలని తలకొండపల్లి మండల కాంగ్రెస్ పార్టీ మాజీ వైస్ ఎంపీపీ మేక.శ్రీనివాస్ రెడ్డి, వార్డు సభ్యులు రేణు రెడ్డి, మరి కొంతమంది నాయకులు గ్రామ శివారు ప్రాంతంలో అత్యంత మహిమగల బండలగడ్డ ఆంజనేయస్వామిని ప్రార్థించారు.
తమ నాయకుడు కసిరెడ్డి ఎమ్మెల్యేగా గెలిస్తే ఆలయంలో సత్యనారాయణ స్వామి వ్రతం, యజ్ఞ మహోత్సవం నిర్వహిస్తామని వారు మొక్కుకున్నారు. ఎమ్మెల్యే విజయం సాధించడంతో, ఆ మొక్కును నెరవేర్చుతూ మంగళవారం ఆలయ ప్రాంగణంలో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి మాట్లాడుతూ "లోక కళ్యాణం, ప్రజల సుఖశాంతులు, రాష్ట్ర అభివృద్ధి కోసం ఇటువంటి దైవ కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం. మన ప్రాంతంలో సకాలంలో వర్షాలు కురిసి రైతులు పాడిపంటలతో సుభిక్షంగా ఉండాలని, ప్రతి కుటుంబం ఆనందంగా జీవించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాం అన్నారు.
ప్రజల ఆశీర్వాదంతో సేవ చేసే అవకాశం లభించిందని, ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. నియోజకవర్గ అభివృద్ధి, గ్రామాల పురోగతి, రైతుల సంక్షేమం, యువతకు ఉపాధి అవకాశాల కల్పనకు నిరంతరం కృషి చేస్తామని తెలిపారు. ప్రజల సహకారం, దైవానుగ్రహం ఉంటే కల్వకుర్తి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అంతకుముందు గట్టు ఇప్పలపల్లి సర్పంచ్ చంద్రశేఖర్ దేవాలయ నిర్మాణానికి కోటి రూపాయలు ప్రకటించాలని, దేవాలయానికి వచ్చే రహదారిని సీసీ రోడ్డుగా మార్చే విధంగా నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యేకు వినతి పత్రం అందించారు.
అదేవిధంగా కార్గే జన్మదినోత్సవ సందర్భంగా కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్యే నారాయణరెడ్డి, సంధ్యా రెడ్డిలు కేక్ కట్ చేసి కార్యకర్తలకు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో పీసీసీ సభ్యులు శ్రీనివాస్ గౌడ్, ఏఎంసీ చైర్మన్ గీతా నరసింహ, ఉపాధ్యక్షులు భాస్కర్ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కాసు. శ్రీనివాస్ రెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ కేశవరెడ్డి, బ్లాక్ స్థాయి మహిళా అధ్యక్షురాలు రమాదేవి, కల్వకుర్తి బ్లాక్ స్థాయి అధ్యక్షుడు విజయ్ కుమార్ రెడ్డి, డిసిసి ప్రధాన కార్యదర్శి రఘురాములు, స్థానిక సర్పంచ్ చంద్రశేఖర్, ఆయా గ్రామాల సర్పంచులు రామ లక్ష్మణ్, భారతమ్మ గోపాల్,రమేష్, రాజు నాయక్, నాయకులు భగవాన్ రెడ్డి, ప్రదీప్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి,శివకుమార్, డేవిడ్, రాజేంద్ర నాయక్, రమేష్ యాదవ్, నరసింహారెడ్డి, కృష్ణ, రేణు రెడ్డి, తిరుపతి, పవన్ వాల్మీకి, వజ్ర లింగం, రఘుపతి రెడ్డి, అంజయ్య గుప్తా, వెంకటరెడ్డి, రాఘవేందర్ యాదవ్, ఆయా గ్రామాల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలు పెద్ద ఎత్తున హాజరయ్యారు.






