భారత రాజకీయ చరిత్రలో ఇది చీకటి రోజు: బీజేపీ చీఫ్ నితిన్ నబీన్ తీవ్ర విమర్శలు

by Kema Shiva Kumar |

ప్రధాని నివాసం వద్ద కాంగ్రెస్ నిరసనపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ మండిపడ్డారు.

భారత రాజకీయ చరిత్రలో ఇది చీకటి రోజు: బీజేపీ చీఫ్ నితిన్ నబీన్ తీవ్ర విమర్శలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీలోని ప్రధానమంత్రి నివాసం సమీపంలో కాంగ్రెస్ నాయకులు చేపట్టిన నిరసన ప్రదర్శనపై భారతీయ జనతా పార్టీ (BJP) జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ (Nitin Nabin) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. లోక్‌సభ ప్రతిపక్ష నేతగా ఉన్న రాహుల్ గాంధీ (Rahul Gandhi) ప్రవర్తన అత్యంత అభ్యంతరకరంగా ఉందని కామెంట్ చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రతిపక్ష నేత అనే రాజ్యాంగబద్ధమైన పదవికి ఉన్న హోదాను, బాధ్యతను రాహుల్ గాంధీ మరిచారని అన్నారు. దేశంలో అరాచకత్వానికి రాహుల్ గాంధీ ఓ ప్రతీకగా మారుతున్నారని తాము ఫస్ట్ నుంచి చెబుతున్నామని నవీన్ విమర్శించారు.

ప్రధాని దేశం మొత్తానికి నాయకుడు..

కొన్ని పార్లమెంటరీ, రాజ్యాంగ పదవులు ఏ ఒక్క పార్టీకి మాత్రమే పరిమితం కావని నితిన్ నబీన్ అన్నారు. ప్రధాని కేవలం ఓ పార్టీకే పరిమితం కాదని.. ఆయన 140 కోట్లకు పైగా భారత పౌరులకు ప్రాతినిధ్యం వహించే ఎన్నుకోబడిన నాయకుడి తెలిపారు. అలాంటి ప్రధాని నివాసం వద్దకు వెళ్లి అరాచకం సృష్టించేందుకు రాహుల్ గాంధీ అండ్ టీమ్ ప్రయత్నించడం ప్రజాస్వామ్యయుత నిరసన కానే కాదు, అది కేవలం అరాచక రాజకీయం మాత్రమేనని ఆరోపించారు. మల్లికార్జున ఖర్గే వంటి సీనియర్ నేత కూడా రాహుల్ గాంధీతో కలిసి ఈ తరహా నిరసనల్లో పాల్గొనడం విచారకరమని అన్నారు. భారత రాజకీయ చరిత్రలోనే ఇదొక చీకటి రోజున నితిన్ నబీన్ అన్నారు.

చర్చలకు మేము సిద్ధం..

తాము కూడా సుదీర్ఘకాలం పాటు ప్రతిపక్షంలో సేవలు అందించామని, అయితే ఏనాడూ ఇటువంటి పరిమితులను దాటలేదని నితిన్ నబీన్ అన్నారు. రాహుల్ గాంధీ విధించిన షరతులకు సైతం అంగీకరించినప్పటికీ ఆయన మళ్లీ మాట మార్చి బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారని ఆరోపించారు. పార్లమెంట్ (Parliament) వేదికగా ఏ అంశంపైనా అయినా చర్చించేందుకు మేము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నామని నితిన్ నబీన్ అన్నారు.

Next Story