- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పార్టీలో కష్టపడ్డ వారికి తప్పనిసరిగా గుర్తింపు.. చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య
కాంగ్రెస్ పార్టీలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న వారందరికీ తప్పనిసరిగా పార్టీ అనుకూలంగా ఉంటుందని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య పేర్కొన్నారు.

దిశ, శంకర్‌పల్లి : కాంగ్రెస్ పార్టీలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న వారందరికీ తప్పనిసరిగా పార్టీ అనుకూలంగా ఉంటుందని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య పేర్కొన్నారు. నూతనంగా ఎంపికైన శంకర్‌పల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బొల్లారం వెంకట్‌రెడ్డి, శంకర్‌పల్లి మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మడపర్తి చంద్రమౌళికి పార్టీ అధ్యక్ష పదవులను ప్రకటించారు. వారు మంగళవారం ఎమ్మెల్యే యాదయ్యను ఆయన నివాసంలో కలిశారు. ఎమ్మెల్యే వారికి శాలువాలతో సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు తగిన గుర్తింపు ఇస్తుందని స్పష్టం చేశారు. పార్టీ అభివృద్ధికి ఎల్లవేళలా కృషి చేయాలని ఆయన సూచించారు. మండలంలో, మున్సిపాలిటీలో పార్టీ నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ఎప్పటికప్పుడు ప్రజలకు తీసుకెళ్లి, అర్హులైన వారందరికీ అందే విధంగా చూడాలని సూచించారు.
కాంగ్రెస్ పార్టీ పేదల సంక్షేమం కోసం ఆరు గ్యారంటీలను ప్రకటించి అమలు చేసిందని ఆయన పేర్కొన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డుల పంపిణీ తదితర పథకాలను ప్రవేశపెట్టి, అర్హులైన వారందరికీ అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. కార్యకర్తలే పార్టీకి పట్టుకొమ్మలని, పార్టీలో కార్యకర్తల కృషిని గుర్తించడం జరుగుతుందని స్పష్టం చేశారు. నూతనంగా ఎంపికైన మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బొల్లారం వెంకట్‌రెడ్డి, మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మడపర్తి చంద్రమౌళి మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని అన్నారు. తమ పై నమ్మకంతో పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించిన చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, జిల్లా పార్టీ అధ్యక్షుడు నరసింహారెడ్డి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి శ్రీధర్ బాబు, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తదితరులకు కృతజ్ఞతలు తెలిపారు.






