- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పూడుకుపోయిన మోరీ.. నీటమునిగిన బాట !
by Batti.Sumithra |
ఎక్కచెరువు తండా గ్రామంలో డ్రైనేజీ (మోరీ) నిర్వహణ లోపించడంతో గ్రామస్థులు, విద్యార్థులు నిత్యం నరకయాతన అనుభవిస్తున్నారు.

X
దిశ, కొడంగల్ : ఎక్కచెరువు తండా గ్రామంలో డ్రైనేజీ (మోరీ) నిర్వహణ లోపించడంతో గ్రామస్థులు, విద్యార్థులు నిత్యం నరకయాతన అనుభవిస్తున్నారు. మోరీలో మట్టి, చెత్తాచెదారం భారీగా పేరుకుపోవడంతో నీటి ప్రవాహానికి తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది. దీంతో మురుగునీరు రోడ్డుపైకే చేరుకుని పెద్ద ఎత్తున నిలిచిపోతోంది. పాఠశాలకు వెళ్లే చిన్న పిల్లలు, నిత్యం వివిధ పనుల పై రాకపోకలు సాగించే గ్రామ ప్రజలు ఈ బురద, నిలిచిన నీటి గుండా వెళ్లలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నీరు నిల్వ ఉండటంతో దోమలు వ్యాపించి రోగాల బారిన పడే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
స్థానికుల డిమాండ్ : సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి పేరుకుపోయిన మట్టి, చెత్తను తొలగించి మోరీని శుభ్రం చేయాలని, నీటి ప్రవాహం సజావుగా సాగేలా చర్యలు తీసుకోవాలని తండా వాసులు కోరుతున్నారు.
Next Story






