- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వసతులు లేవు.. తాగునీరు రాదు.. మహబూబాబాద్ JNTUH ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థుల నిరసన!
మహబూబాబాద్ జేఎన్‌టీయూహెచ్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థుల ఆందోళన చేపట్టారు.

దిశ, మహబూబాబాద్ టౌన్: మహబూబాబాద్ జేఎన్‌టీయూహెచ్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థుల ఆందోళన చేపట్టారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని మంగళవారం కలెక్టర్ కార్యాలయంకు సమస్యను తెలియజేయడానికి వెళ్తున్న విద్యార్థులను ముడుకోట్ల సెంటర్‌లో పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు అడ్డుకోవడంతో రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. తాగునీరు, హాస్టల్ మౌలిక వసతుల కొరతపై క్లాసులు బహిష్కరించి నిరసన తెలిపారు. సుమారు 30 మంది విద్యార్థులకు ఒకే బాత్‌రూమ్.. తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన చేస్తున్నారు. పలుమార్లు యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లినా సమస్యలు పరిష్కారం కాలేదని ఆరోపణలు రావడంతో వెంటనే నీటి సమస్యను పరిష్కరించి అదనపు బాత్‌రూమ్‌లు ఏర్పాటు చేయాలని డిమాండ్ తో సమస్యలు పరిష్కరించే వరకు ఆందోళన కొనసాగిస్తామని విద్యార్థుల హెచ్చరించారు. విద్యార్ధుల ఆందోళనకు సంఘీభావంగా పలు విద్యార్థి సంఘాలు సంఘీభావం తెలిపాయి.






