ఉద్రిక్తంగా మారిన రైతుల రాస్తారోకో..

by Kodari Anjali |

వరద కాలువ ద్వారా పంటకు సాగునీరు అందించాలని మల్యాల ఎక్స్ రోడ్ వద్ద చేపట్టిన రైతుల రాస్తారోకో ఉద్రిక్తంగా మారింది.

ఉద్రిక్తంగా మారిన రైతుల రాస్తారోకో..
X

దిశ, మల్యాల/జగిత్యాల టౌన్: వరద కాలువ ద్వారా పంటకు సాగునీరు అందించాలని మల్యాల ఎక్స్ రోడ్ వద్ద చేపట్టిన రైతుల రాస్తారోకో ఉద్రిక్తంగా మారింది. రైతులకు సంఘీభావం తెలిపేందుకు జగిత్యాల నుండి వెళ్లిన మాజీ మంత్రి బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి జీవన్ రెడ్డిని నూకపల్లివి ఆర్ కె ఇంజనీరింగ్ కాలేజీ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల తీరును నిరసిస్తూ జీవన్ రెడ్డి నూక పల్లి వద్ద రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగారు. మరోవైపు రైతులకు మద్దతుగా బయలుదేరిన చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో అటు మల్యాల ఎక్స్ రోడ్డుతో పాటు నూకపల్లి వద్ద కరీంనగర్-జగిత్యాల జాతీయ రహదారిపై హైడ్రామా నెలకొంది. పెద్ద ఎత్తున వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు పోలీసులు జీవన్ రెడ్డిని బలవంతంగా అరెస్టు చేసి జగిత్యాల స్టేషన్కు తరలించారు. పోలీసుల తీరును తీవ్రంగా తప్పు పట్టిన జీవన్ రెడ్డి వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

రోడ్డుపై వరినాట్లతో రైతుల నిరసన..

వరద కాలువలో తక్షణమే సాగునీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ స్థానిక రైతులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. వరి నాట్లతో రహదారిపై రైతులు బైఠాయించి రైతు లేనిదే రాజ్యం లేదని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. ప్రభుత్వం వెంటనే వరద కాలువలో నీరు అందించాలని, వర్షాలు లేక రైతులు నాట్లు వేయలేక పోతున్నామని, వరద కాలువకు వెంటనే నీరు విడుదల చేసి రైతులను ఆదుకోవాలని అన్నారు. వెంటనే కాళేశ్వరం నీటిని మళ్లించి రైతుని ఆదుకోవాలని, కాలేశ్వరం ప్రాజెక్టులో రెండు ఫీల్డర్లు దెబ్బతిన్నాయని పేర్కొన్న ప్రభుత్వం రెండు సంవత్సరాలు అయినా మరమత్తు చేపట్టలేదని, గత ప్రభుత్వంలో వరద కాలువలో నీరు అందించి రైతులను ఆదుకుందని అన్నారు. వారం రోజుల్లో నీరు అందించకపోతే కొండగట్టు నుండి జగిత్యాల కలెక్టరేట్ వరకు పాదయాత్ర చేసి కలెక్టర్ ముట్టడిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు, ఐలేని సాగర్ రావు, బోయినపల్లి మధుసూదన్ రావు, బద్ధం తిరుపతిరెడ్డి, మల్లారెడ్డి, జనగాం శ్రీనివాస్, భూమారెడ్డి, అసరుద్దీన్, వివిధ గ్రామాలకు చెందిన రైతులు తదితరులు పాల్గొన్నారు.

Next Story