అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా క్యాంపు ఆఫీసు.. ప్రజావాణిలో బీజేపీ నేత ఫిర్యాదు

by Kodari Anjali |   (  Updated:2026-07-20 10:34:53  IST  )

సిరిసిల్ల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మార్చారని ఆరోపిస్తూ తంగళ్లపల్లి మండలం సారంపల్లి గ్రామ ఉపసర్పంచ్ ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు.

అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా క్యాంపు ఆఫీసు.. ప్రజావాణిలో బీజేపీ నేత ఫిర్యాదు
X

దిశ ప్రతినిధి, రాజన్న సిరిసిల్ల: సిరిసిల్ల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మార్చారని ఆరోపిస్తూ తంగళ్లపల్లి మండలం సారంపల్లి గ్రామ ఉపసర్పంచ్, బీజేపీ నేత సిరిసిల్ల ప్రశాంత్ సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ గరీమ అగ్రవాల్‌కు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ప్రజలందరికీ చెందిన అధికారిక కార్యాలయమని, అది ఏ ఒక్క రాజకీయ పార్టీకి సొంతం కాదని పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం బీఆర్ఎస్ నాయకుల ఆధీనంలో ఉన్నట్లుగా పరిస్థితులు కనిపిస్తున్నాయని, కొందరు వ్యక్తులు దానిని సొంత ఇంటిలా వినియోగిస్తున్నారని ఆరోపించారు. క్యాంపు కార్యాలయంలో ఉంటున్న వ్యక్తులు అధికారిక సిబ్బందేనా, ఏ శాఖకు చెందినవారో జిల్లా యంత్రాంగం విచారణ చేపట్టాలని ఆయన కోరారు. ప్రజా ప్రయోజనాల కోసం ఉండాల్సిన క్యాంపు కార్యాలయం కొందరు రాజకీయ నాయకులకు అడ్డాగా మారిందని ఆరోపించారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం బిఆర్ఎస్ నేతల కబంధహస్తాల్లో ఉందని, రాజకీయ ప్రభావం నుంచి విముక్తం చేసి, సిరిసిల్ల నియోజకవర్గ ప్రజల ఉపయోగానికి అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను ఫిర్యాదులో కోరారు.

Next Story