సాయిలు కంపాటి- సుమంత్ ప్రభాస్ కాంబో ఫిక్స్.. పూజా కార్యక్రమాలతో గ్రాండ్‌గా లాంచ్

by Mallepaka Hamsa |

సాయిలు కంపాటి-సుమంత్ ప్రభాస్ కాంబినేషన్‌లో రాబోతున్న కొత్త చిత్రం ఈ రోజు ఒక దేవాలయంలో పూజా కార్యక్రమాలతో అధికారికంగా ప్రారంభమైంది.

సాయిలు కంపాటి- సుమంత్ ప్రభాస్  కాంబో ఫిక్స్.. పూజా కార్యక్రమాలతో గ్రాండ్‌గా లాంచ్
X

దిశ, సినిమా: ‘మేము ఫేమస్’ సినిమాతో హీరోగా, దర్శకుడిగా టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును రాబట్టుకున్నారు సుమంత్ ప్రభాస్. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ మూవీ పెద్దగా హిట్ అందుకోలేపోయింది. దీంతో మూడేళ్లు గ్యాప్ తీసుకుని సుమంత్ ప్రభాస్ ఇటీవల ‘గోదావరి గట్టుపైన’ మూవీతో ప్రేక్షకులను అలరించారు. అయితే గత కొద్ది కాలంగా ఆయన తదుపరి చిత్రాన్ని ‘రాజు వెడ్స్ రాంబాయి’ మూవీతో ఇండస్ట్రీకి వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సాయిలు కంపాటీ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈనేపథ్యంలో.. తాజాగా, ఈ విషయాన్ని నిజం చేస్తూ మూవీ మేకర్స్ నేడు పూజా కార్యక్రమాలతో ఈ ప్రాజెక్ట్‌ను ప్రారంభించారు. ఈ క్రేజీ కాంబినేషన్‌లో రాబోతున్న కొత్త చిత్రం ఈ రోజు ఒక దేవాలయంలో పూజా కార్యక్రమాలతో అధికారికంగా ప్రారంభమైంది.

ఈ వేడుకకు టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్ ముఖ్య అతిథిగా వచ్చి ఫస్ట్ షాట్‌కు క్లాప్ కొట్టగా.. శేఖర్ కమ్ముల కెమెరా స్విచ్ ఆన్ చేశారు. అయితే ఈ సినిమాను శ్రీవెంకటేశ్వర బ్యానర్‌పై ప్రొడక్షన్ నం10గా శ్రీ భరత్ నారంగ్, రామ్ మోహన్ రావు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ పూజా కార్యక్రమానికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ‘రాజు వెడ్స్ రాంబాయి’ లాంటి సెన్సేషనల్ హిట్ ఇచ్చిన డైరెక్టర్ సాయిలు కంపాటి, సుమంత్ ప్రభాస్‌ను సరికొత్తగా చూపించబోతున్నారని టాక్. ఈ ఇద్దరు టాలెంటెడ్ యువ నటీనటులు, సాంకేతిక నిపుణుల కాంబో సెట్ అవ్వడంతో సినిమాపై అప్పుడే మంచి అంచనాలు మొదలయ్యాయి. ఈ అప్‌డేట్ చూసిన నెటిజన్లు, అభిమానులు.. సుమంత్ ప్రభాస్ ఖాతాలో ఈసారి గ్యారెంటీగా ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ పడటం ఖాయమంటూ క్రేజీ కామెంట్లు పెడుతున్నారు.

Next Story