- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మనుషుల్లో మహనీయుడు ముద్రగడ: సజ్జల రామకృష్ణారెడ్డి
కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అనారోగ్యం కారణంగా ఇటీవల మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఆయన కుటుంబాన్ని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి పరామర్శించారు..

దిశ, వెబ్ డెస్క్: కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం(Mudragada Padmanabham) అనారోగ్యం కారణంగా ఇటీవల మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఆయన కుటుంబాన్ని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి(Sajjala Ramakrishna Reddy) పరామర్శించారు. తూర్పు గోదావరి జిల్లా(East Godavari District) కిర్లంపూడి(Kirlampudi)లో ముద్రగడ సమాధికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ ముద్రగడ పద్మనాభం మనుషుల్లో మహనీయుడని కొనియాడారు. ఆయన జీవితమంతా పేదలకోసమే పని చేశారని సజ్జల గుర్తు చేశారు. ముద్రగడ ఆశయాలు ప్రతిఒక్కరికీ ఆదర్శమన్నారు. జగన్ ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం బాగుంటుందని ముద్రగడ పద్మనాభం నమ్మరాని తెలిపారు. జగన్ ఆశయాలు నచ్చడంతో ముద్రగడ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారని చెప్పారు. నమ్మిన సిద్ధం కోసమే పద్మనాభం పని చేశారని, పదవులు కోసం ఆశించలేదన్నారు. కాపు వెనకబాటు తనం పోవాలని ముద్రగడ ఎంతో ప్రయత్నం చేశారని గుర్తు చేశారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(Ys Jagan Mohan Reddy)ని మరోసారి ముఖ్యమంత్రిని చేయాలని ముద్రగడ పని చేశారని సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు.






