TG: గ్లోబల్ సమ్మిట్‌లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |   (  Updated:2025-12-08 10:54:07  IST  )

TG: గ్లోబల్ సమ్మిట్‌లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

TG: గ్లోబల్ సమ్మిట్‌లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: రంగారెడ్డి జిల్లా కందుకూరులోని ఫ్యూచర్‌ సిటీలో తెలంగాణ రైజింగ్‌’ పేరిట రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన గ్లోబల్‌ సమిట్‌ (Telangana Rising Global Summit) అట్టహాసంగా ప్రారంభమైంది. గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ ప్రారంభించారు. ఈ సమ్మిట్‌కు సీఎం రేవంత్‌రెడ్డి (Revanth reddy), కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులతో పాటు సినీ ప్రముఖులు, వివిధ సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి(Kishan Reddy) మాట్లాడుతూ.. 2014లో తెలంగాణ ఏర్పడినప్పుడే ప్రధానిగా మోడీ బాధ్యతలు చేపట్టారు. పదేళ్లలో తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందింది. హైదరాబాద్ కేవలం రాష్ట్ర రాజధానే కాదు. దేశంలో కీలకమైన ఆర్థిక నగరం. ఒక్క మాటలో చెప్పాలంటే.. దేశ ఆర్థిక రంగానికి హైదరాబాద్ పిల్లర్ అని అన్నారు. ఫార్మా హబ్‌గా, ఏరోస్పేస్ సెంటర్‌గా హైదరాబాద్ అవతరించిందని చెప్పారు. పార్టీలకు అతీతంగా హైదరాబాద్‌ బ్రాండ్ ఇమేజ్‌ను పెంచాల్సిన అవసరం ఉంది. వికసిత్ భారత్ సాధనలో రాష్ట్రాలు భాగస్వామ్యం కావాలి. దేశంలోని అన్ని రాష్ట్రాల మధ్య ఆరోగ్యకర పోటీ ఉండాలి. పెట్టుబడులకు భారత్ స్వర్గధామం.. సురక్షితమైన దేశం అని కిషన్ రెడ్డి అన్నారు. గత పదేళ్లలో రాష్ట్రం అనేక రంగాల్లో ప్రగతి సాధించింది. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కూడా అద్భుతంగా సహకరిస్తోందని చెప్పారు. వికసిత్ భారత్‌ 2047లో తెలంగాణది అత్యంత కీలకమైన పాత్ర అని గుర్తుచేశారు.

Read More...

పెట్టుబడులకు తెలంగాణ బెస్ట్ డెస్టినేషన్: మంత్రి శ్రీధర్ బాబు

ప్రపంచ దేశాలతో తెలంగాణ పోటీ పడుతోంది.. గ్లోబ‌ల్ స‌మ్మిట్‌లో డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు

Next Story