వందల కోట్లు దోచుకుంటున్నారు: వైసీపీ ఎంపీ ఆందోళన

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-07-19 08:10:16  IST  )

ఏపీ రాజధాని నిర్మాణంపై వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతి పేరుతో కూటమి ప్రభుత్వం దోచుకుంటుందని ఆయన ఆరోపించారు. ఢిల్లీ పార్లమెంట్ భవనంలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నారు....

వందల కోట్లు దోచుకుంటున్నారు: వైసీపీ ఎంపీ ఆందోళన
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ రాజధాని నిర్మాణంపై వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి(Yv Subbareddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతి(Amaravati) పేరుతో కూటమి ప్రభుత్వం దోచుకుంటుందని ఆయన ఆరోపించారు. ఢిల్లీ పార్లమెంట్ భవనం(Delhi Parliment Building)లో జరిగిన అఖిలపక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్ర రాజధానిగా మావిగనే కరెక్ట్ అని వ్యాఖ్యానించారు. మావిగన్ ప్రాంతమే రాజధానికి అనుకూలమని తెలిపారు. అమరావతిలో జరుగుతున్న దోపిడీ తాము వ్యతిరేకమని స్పష్టం చేశారు. ఒకే చోట పెట్టుబడులు పెట్టించి వందల కోట్లు దోచుకుంటున్నారని వైవీ సుబ్బారెడ్డి ఆరోపించారు.

పార్లమెంట్‌లో పోరాటం చేస్తాం..

పార్లమెంట్ సమావేశాల్లో ఏపీ అభివృద్ధికి సహకరించాలని, పెండింగ్ నిధులు, సమస్యలను పరిష్కరించాలని కోరతామని వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్ర అప్పులు, ఆక్వా రైతుల సమస్యలు, ఎస్సీలపై దాడులు, పరిశ్రమల సమస్యలపైనా పార్లమెంట్ సమావేశాల్లో లేవనెత్తుతామని చెప్పారు. ఈ సమావేశాల్లో డీఎస్సీ కుంభకోణంపై చర్చ జరగాలన్నారు. రాష్ట్రంలో రైతులకు గిట్టుబాటు ధర లేదని, తద్వారా వాళ్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. మామిడి, పొగాకు, మొక్కజోన్న రైతులు అష్ట కష్టాల్లో ఉన్నారని, దీనిపై కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ సమావేశాల్లో చర్చకు అవకాశం కల్పించాలన్నారు. రాష్ట్రంలో ఫీడ్ మాఫియా రెచ్చిపోతోందని, దాని వల్ల అక్వా కల్చర్ దెబ్బ తింటోందని వైవీ సుబ్బారెడ్డి ఆరోపించారు.

ప్రభుత్వ ఆస్తులపై పెత్తనం..

ప్రభుత్వ ఆస్తులపై ప్రైవేటు పెత్తనాన్ని ప్రోత్సహిస్తున్నారని వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యానించారు. పోర్టుల, ఫిసింగ్ హార్బర్లు, మెడికాల్ కాలేజీలను ప్రైవేటుకు అప్పగిస్తున్నారని మండిపడ్డారు. వైఎస్ జగన్ హయాంలో సృష్టించిన ఆస్తులను సీఎం చంద్రబాబు ప్రైవేటుకు దారాదత్తం చేస్తున్నారని వైవీ సుబ్బారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్న పరిశ్రమలు మూత పడుతున్నాయని, నిరుద్యోగ సమస్య విపరీతంగా పెరిగిపోయిందని వైవీ సుబ్బారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.

Next Story