అబద్ధాలు చెప్పడంలో సీఎం రేవంత్ రెడ్డి దిట్ట.. జక్క వెంకట్ రెడ్డి

by Batti.Sumithra |

అమలు చేయలేని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను నయవంచనకు గురి చేసిందని పీర్జాదిగూడ మాజీ మేయర్ జక్క వెంకట్ రెడ్డి విమర్శించారు.

అబద్ధాలు చెప్పడంలో సీఎం రేవంత్ రెడ్డి దిట్ట.. జక్క వెంకట్ రెడ్డి
X

దిశ, మేడిపల్లి : అమలు చేయలేని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను నయవంచనకు గురి చేసిందని పీర్జాదిగూడ మాజీ మేయర్ జక్క వెంకట్ రెడ్డి విమర్శించారు. ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి అబద్ధాలు చెప్పడంలో దిట్ట అని ఆరోపించారు. తెలంగాణ సాధనలో కేసీఆర్ పాత్రను విస్మరించి అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని, మరోసారి కేసీఆర్‌ పై అవమానకర వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. కాళేశ్వరం ప్రాజెక్టు, హైడ్రా చర్యలు, రైతుల సమస్యలు, ఉద్యోగుల ఇబ్బందులు, గ్రామ పంచాయతీలకు నిధుల కొరత వంటి అంశాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. రాష్ట్రంలో అన్నివర్గాల ప్రజల్లో ప్రభుత్వం పై తీవ్రఅసంతృప్తి నెలకొందని, ముందస్తు ఎన్నికలు నిర్వహిస్తే కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని జక్క వెంకటరెడ్డి అన్నారు.

Next Story