ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగులు మరింత దూకుడు.. తాజా డిమాండ్స్ ఇవే..!

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-07-20 08:44:18  IST  )

రాష్ట్రంలో Apstrc ఉద్యోగుల నిరసన కొనసాగుతోంది. ఆర్టీసీ ప్రైవేటీకరించొద్దంటూ రోజుకో కార్యచరణతో ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా సంతకాల సేకరణ చేపట్టారు....

ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగులు మరింత దూకుడు.. తాజా డిమాండ్స్ ఇవే..!
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో Apstrc ఉద్యోగుల నిరసన కొనసాగుతోంది. ఆర్టీసీ ప్రైవేటీకరించొద్దంటూ రోజుకో కార్యచరణతో ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా సంతకాల సేకరణ చేపట్టారు. ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోళ్లను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించాలన్న నిర్ణయాన్ని ఉద్యోగులు వ్యతిరేకించారు. E-బస్సులను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ బస్సులను ఆర్టీసీ ద్వారానే నడిపించాలని కోరారు. అలాగే ఆర్టీసీకి అవసరమైన నిధులు, వనరులు కేటాయించాలని, సంస్థలో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ నెల 27న జిల్లా కలెక్టర్ల ద్వారా సీఎం చంద్రబాబును కలిసి వినతి పత్రాలు అందజేయనున్నారు. స్త్రీ శక్తి పథకం ద్వారా పెరిగిన రద్దీ దృష్ట్యా కొత్త బస్సులు పెంచాలని ఆర్టీసీ జేఏసీ నేతలు విజ్ఞప్తి చేశారు.న

Next Story