పార్లమెంట్ ముట్టడి ఇవాళ‌ కొనసాగుతుంది.. CJP ఫౌండర్ ప్ర‌క‌ట‌న‌

by velandi.Saikiran |

పార్లమెంట్ ముట్టడి ఇవాళ‌ కొనసాగుతుందని CJP ఫౌండర్ అభిజీత్ ప్ర‌క‌ట‌న చేశారు.

పార్లమెంట్ ముట్టడి ఇవాళ‌ కొనసాగుతుంది.. CJP ఫౌండర్ ప్ర‌క‌ట‌న‌
X

దిశ‌, వెబ్ డెస్క్: CJP ఫౌండర్ అభిజీత్ దీప్కే సంచలన ప్రకటన చేశారు. ఇవాళ కూడా పార్లమెంటు ముట్టడి నిరసన కార్యక్రమం కొనసాగుతుందని వెల్లడించారు. సోమవారం రాత్రి నిరసనల అనంతరం ఆందోళనకారులు తిరిగి జంతర్ మంతర్ వద్దకు చేరుకున్నారు. ఈ క్రమంలోనే జంతర్ మంతర్ వద్దకు వెళ్లిన అభిజీత్ దీప్కే.. మీడియాతో మాట్లాడారు. తాము మళ్లీ పార్లమెంటు ముట్టడికి వెళ్తామని ప్రకటించారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు జంతర్ మంతర్ ను వీడేది లేదని స్పష్టం చేశారు. తమపై లాఠీ చార్జ్ చేయడం చాలా దారుణమని.. దీనిపై న్యాయ పోరాటం చేస్తామన్నారు అభిజీత్ దీప్కే. ఇది ఇలా ఉండగా మొదటి రోజు ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. ఈ నేపథ్యంలో దాదాపు 70 మంది CJP కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. అడు ఆందోళనకారుల తిరుగుబాటు నేపథ్యంలో 118 మంది పోలీసులకు గాయాలయ్యాయి.

Next Story