- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సర్జరీ, ఐసీయూలో చికిత్స.. అమితాబ్ పోస్ట్‌తో ఆందోళన చెందుతున్న అభిమానులు
ఈ సమయంలో శారీరక నొప్పితో పాటు మానసిక ఒత్తిడిని కూడా తట్టుకోవాల్సి వస్తోందని చెప్పారు.

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరో అమితాబ్ బచ్చన్ 83 ఏళ్ల వయసులోనూ సినిమాల్లో తనదైన నటనతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్‌తో కుర్ర హీరోలకు గట్టి పోటీనిస్తున్నారు. అయితే షూటింగ్స్ కారణంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఆయన, తాజాగా చేసిన ఒక పోస్ట్ అభిమానులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఇటీవల తనకు ఒక సర్జరీ జరిగిందని, కొద్దిరోజులు ఐసీయూలో కూడా ఉండాల్సి వచ్చిందని వెల్లడించారు. వైద్యుల సంరక్షణ తర్వాత కోలుకుని ఇంటికి తిరిగొచ్చినట్లు చెప్పారు. అయితే తనకు వచ్చిన ఆరోగ్య సమస్య ఏంటనేది మాత్రం ఆయన బయటపెట్టలేదు. అంతేకాకుండా ఆసుపత్రి నుంచి ఇంటికి తిరిగొచ్చిన తర్వాతే అసలైన సవాళ్లు మొదలయ్యాయని ఆయన పేర్కొన్నారు. సర్జరీ తర్వాత శరీరం సహకరించే విధానం, కోలుకునే ప్రక్రియ చాలా కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సమయంలో శారీరక నొప్పితో పాటు మానసిక ఒత్తిడిని కూడా తట్టుకోవాల్సి వస్తోందని చెప్పారు. జీవిత సూత్రాల గురించి మాట్లాడుతూ.."మనం జీవితంలో ఎంత పెద్ద విజేతగా నిలిచినా, ఎంతటి ఎత్తుకు ఎదిగినా ఏదో ఒక రోజు ఓటమి మనల్ని వెతుక్కుంటూ వచ్చి పలకరిస్తుంది. అది అందరి జీవితాల్లోనూ అత్యంత కష్టమైన సమయం. అలాంటి సమయం వచ్చినప్పుడు కొందరు దాన్ని గుండె ధైర్యంతో ఎదుర్కొంటారు. మరికొందరు మాత్రం ఆ పరిస్థితులకు లొంగిపోతారు. ఏది ఏమైనా అందరూ ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలి" అని ఆయన చెప్పుకొచ్చారు.ఈ పోస్ట్ వైరల్ కావడంతో అమితాబ్ అభిమానులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. 83 ఏళ్ల వయసులో ఐసీయూ వరకు వెళ్లొచ్చారని తెలిసి బిగ్‌బీ ఆరోగ్య పరిస్థితిపై నెటిజన్లు ఆరా తీస్తున్నారు. ఆయనకు వచ్చిన సమస్య ఏంటో తెలియకపోయినా, అమితాబ్ త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో మళ్లీ షూటింగ్‌లలో పాల్గొనాలని, మునుపటిలా స్క్రీన్ పై కనిపించాలని కోరుకుంటూ సోషల్ మీడియా వేదికగా మెసేజ్‌లు పెడుతున్నారు.






