కేఎల్ రాహుల్ ను 6వ స్థానంలో పంపిస్తారా ? మాజీ క్రికెట‌ర్ ఫైర్

by velandi.Saikiran |

కేఎల్ రాహుల్ బ్యాటింగ్ ఆర్డ‌ర్ మార్చ‌డంపై కృష్ణమాచారి శ్రీకాంత్ సీరియ‌స్ అయ్యారు.

కేఎల్ రాహుల్ ను 6వ స్థానంలో పంపిస్తారా ? మాజీ క్రికెట‌ర్ ఫైర్
X

దిశ‌, వెబ్ డెస్క్: లార్డ్స్ వేదికగా జరిగిన చివరి వన్డేలో భారత బ్యాటింగ్ ఆర్డర్ మార్చడంపై కృష్ణమాచారి శ్రీకాంత్ సీరియస్ అయ్యారు. అనవసరంగా కేఎల్ రాహుల్ ను ఆరో స్థానంలో పంపి, గంభీర్ తప్పు చేశారని ఆగ్రహించారు. వన్డేల్లో కేఎల్ రాహుల్ కు మంచి అనుభవం ఉందని... ఇలాంటి వ్యక్తిని వినియోగించుకోవడంలో భారత జట్టు విఫలమైందన్నారు. తరచూ ప్రయోగాలు చేసి...రాహుల్ కెరీర్ దెబ్బతీస్తున్నారని ఆగ్రహించారు.

ఇషాన్ కిషన్, అయ్యర్ లను రాహుల్ కంటే ముందు పంపడం చాలా తప్పు అంటూ ఫైర్ అయ్యారు. ఇద్దరి కంటే ముందు రాహుల్ లార్డ్స్ వేదికగా బ్యాటింగ్ చేసి ఉంటే...మ్యాచ్‌ మరోలా ఉండేదన్నారు. కచ్చితంగా మ్యాచ్ భారత వ‌శం అయ్యేదని తెలిపారు. అలా కాకుండా గౌతమ్ గంభీర్ తనకు నచ్చినట్లుగా బ్యాటింగ్ ఆర్డర్ మార్చి.. ఓటమికి కారణమయ్యాడని ఫైర్ అయ్యారు. కేఎల్ రాహుల్ ను జాగ్రత్తగా వాడి ఉంటే బాగుండేదని చురకలు అంటించారు కృష్ణమాచారి శ్రీకాంత్.

Next Story