- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తూప్రాన్ లో పట్టుబడ్డ నకిలీ డాక్టర్..
ఎటువంటి ప్రామాణిక అర్హతలు లేకుండా 15 ఏళ్లుగా వైద్యం అందిస్తున్న నకిలీ డాక్టర్ గుట్టురట్టు చేశారు మెదక్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారులు.

దిశ, తూప్రాన్ : ఎటువంటి ప్రామాణిక అర్హతలు లేకుండా 15 ఏళ్లుగా వైద్యం అందిస్తున్న నకిలీ డాక్టర్ గుట్టురట్టు చేశారు మెదక్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారులు. మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణంలోని భవాని ప్రథమ చికిత్సాలయం పై జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారులు ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. తనిఖీల్లో భాగాంగా.. సలీలా అనే మహిళ ఎలాంటి అర్హత లేకున్న అక్రమ ప్రాక్టీసు చేస్తునట్టు అధికారులు గుర్తించారు. సలీలా కేవలం జీఎంఎం కోర్సు మాత్రమే పూర్తి చేసిందని, డాక్టర్గా వైద్యం చేసేందుకు డిప్యూటీ డిఎంఎచ్వో డాక్టర్ అనిల్ రెడ్డి నుండి ఎలాంటి అనుమతులు పొందలేదని అధికారులు తెలిపారు.
ఏ అర్హత లేకపోయినప్పటికీ డాక్టర్గా చెలామణి అవుతూ గత 15 సంవత్సరాలుగా వైద్య ప్రాక్టీస్ నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. సలీలా గతం నుండి ప్రసవాలు, అనైతిక అబార్షన్లు కూడా చేస్తున్నట్లు ఆమె వద్ద ఉన్న పాత రికార్డుల ద్వారా వెల్లడైందని అధికారులు స్పష్టం చేశారు. ప్రథమ చికిత్సకు మించి పూర్తిస్థాయి డాక్టర్గా రోగులకు యాంటీబయోటిక్స్, ఇంజెక్షన్లు ఇస్తూ, బీపీ తనిఖీలతో పాటు గమనించినట్లు పేర్కొన్నారు. అనర్హులైన వ్యక్తులు వైద్యం పేరిట అమాయక ప్రజల ప్రాణాలతో చెలగాటమాడితే ఉపేక్షించేది లేదని అధికారులు స్పష్టం చేశారు. ముఖ్యంగా అక్రమ అబార్షన్ల వల్ల లింగ నిష్పత్తి క్షీణించే ప్రమాదం ఉందని, ఇటువంటి చర్యల వల్ల సమాజానికి తీరని నష్టం జరుగుతుందని అన్నారు. ఈ నకిలీ డాక్టర్ సలీల విషయమై ఉన్నతాధికారులు, రెవెన్యూ, పోలీసు శాఖలకు సమాచారం అందించి సదరు ఆసుపత్రిని సీజ్ చేసి, చట్టపరమైన తగిన చర్యలు వెల్లడించారు.






