మణుగూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అతిథి అధ్యాపక పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

by Ratna Kumari |

మణుగూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2026–27 విద్యా సంవత్సరానికి ఖాళీగా ఉన్న అతిథి అధ్యాపకుల పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ యర్నం చిన్నప్పయ్య మంగళవారం తెలిపారు.

మణుగూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అతిథి అధ్యాపక పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం
X

దిశ, మణుగూరు : మణుగూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2026–27 విద్యా సంవత్సరానికి ఖాళీగా ఉన్న అతిథి అధ్యాపకుల పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ యర్నం చిన్నప్పయ్య మంగళవారం తెలిపారు. కళాశాలలో ఇంగ్లీష్, కెమిస్ట్రీ, ఎకనామిక్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్, కామర్స్, పొలిటికల్ సైన్స్ విభాగాల్లో ఒక్కో పోస్టు చొప్పున మొత్తం ఆరు అతిథి అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు. అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టులో కనీసం 55 శాతం మార్కులతో పీజీ ఉత్తీర్ణులై ఉండాలని తెలిపారు. నెట్, సెట్, పీహెచ్‌డీ అర్హతలు కలిగిన వారికి, అలాగే ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో గతంలో అతిథి అధ్యాపకులుగా పనిచేసిన అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు వెల్లడించారు.

అర్హులైన అభ్యర్థులు తమ దరఖాస్తుతో పాటు విద్యార్హతలు, అనుభవానికి సంబంధించిన ఒరిజినల్ సర్టిఫికెట్లు, వాటి జిరాక్స్ ప్రతులను జూలై 23 సాయంత్రం 4 గంటలలోపు మణుగూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సమర్పించాలని సూచించారు. దరఖాస్తు చేసిన అభ్యర్థులకు జూలై 24 ఉదయం 11 గంటలకు కొత్తగూడెంలోని ఎస్.ఆర్ ఆర్ట్స్ అండ్ సైన్స్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ యర్నం చిన్నప్పయ్య తెలిపారు.

Next Story