జమ్మికుంట రైల్వే ట్రాక్‌పై వ్యక్తి ఆత్మహత్య..

by Kodari Anjali |

పక్షవాతంతో బాధపడుతున్న ఓ వ్యక్తి జమ్మికుంట రైల్వే ట్రాక్‌పై ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన చోటుచేసుకుంది.

జమ్మికుంట రైల్వే ట్రాక్‌పై వ్యక్తి ఆత్మహత్య..
X

దిశ, జమ్మికుంట: పక్షవాతంతో బాధపడుతున్న ఓ వ్యక్తి జమ్మికుంట రైల్వే ట్రాక్‌పై ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన చోటుచేసుకుంది. మృతుడు పెరుక రాజయ్య ( 58). స్వగ్రామం పెద్దపల్లి జిల్లా, ఓదెల మండలం, కనగర్తి గ్రామం. గత 18 సంవత్సరాలుగా మోత్కూలగూడెం, జమ్మికుంటలో నివాసం ఉంటూ హమాలీ పని చేస్తుండేవాడు. గత ఒక సంవత్సరంగా పక్షవాతంతో బాధపడుతున్న రాజయ్య సోమవారం జమ్మికుంట దుర్గ కాలనీ సమీపంలోని రైల్వే ట్రాక్‌పైకి వెళ్లి ఎదురొచ్చిన రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు గుర్తించి రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. మృతునికి భార్య లక్ష్మి, నలుగురు కుమార్తెలు ఉన్నారు. సమాచారం అందుకున్న రామగుండం ప్రభుత్వ రైల్వే పోలీస్ హెడ్ కానిస్టేబుల్ జి. తిరుపతి ఘటనాస్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story