విద్యుత్ ఉద్యోగుల ధర్నాపై నిషేధం.. టీజీఎస్‌పీడీసీఎల్‌ ఎండీ హెచ్చరిక!

by Ramesh Naini |

తమ డిమాండ్ల పరిష్కారం కోసం తెలంగాణ విద్యుత్ ఆర్టిసాన్ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ ధర్నాకు పిలుపునిచ్చింది.

విద్యుత్ ఉద్యోగుల ధర్నాపై నిషేధం.. టీజీఎస్‌పీడీసీఎల్‌ ఎండీ హెచ్చరిక!
X

దిశ, తెలంగాణ బ్యూరో : తమ డిమాండ్ల పరిష్కారం కోసం తెలంగాణ విద్యుత్ ఆర్టిసాన్ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ (టీవీఏఈజేఏసీ) ధర్నాకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో యాజమాన్యం కీలక ఆదేశాలు జారీ చేసింది. టీజీఎస్‌పీడీసీఎల్‌ కార్పొరేట్ కార్యాలయం ఎదుట బుధవారం తలపెట్టిన ధర్నాపై నిషేధం విధించింది. ఈ మేరకు టీజీఎస్‌పీడీసీఎల్‌ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ జితేష్ వి.పాటిల్ పేరుతో ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ ఆదేశాల ప్రకారం.. తెలంగాణ పవర్ యూటిలిటీస్‌లోని అన్ని సేవల్లో సమ్మెలు, ధర్నాలను నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది ఫిబ్రవరి 25 నుంచి ఆగస్టు 24 వరకు ఆరు నెలల పాటు ఎస్మా యాక్ట్‌ను అమలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ నేపథ్యంలో నేడు జరగాల్సిన ధర్నాలో తమ నియంత్రణలో పనిచేస్తున్న ఆర్టిసాన్ సిబ్బంది ఎవరూ పాల్గొనొద్దని టీజీఎస్‌పీడీసీఎల్‌లోని అన్ని విభాగాల ఫంక్షనల్ హెడ్స్‌ను ఎండీ ఆదేశించారు. సమ్మెలు, ధర్నాలు చట్టపరమైన నిషేధంలో ఉన్నందున, నిబంధనలను ఉల్లంఘించి ఆందోళనలో పాల్గొనే వారిపై చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఈ ఆదేశాలపై టీవీఏఈజేఏసీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము ఖచ్చితంగా ధర్నా నిర్వహిస్తామని పేర్కొన్నారు.

Next Story