- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బాలకృష్ణతో ఫోన్‌లో మాట్లాడిన సీఎం చంద్రబాబు.. ఎక్స్ వేదికగా ఆసక్తికర పోస్ట్
'NBK 111' సినిమా షూటింగ్లో గాయపడిన ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ త్వరగా కోలుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: 'NBK 111' సినిమా షూటింగ్లో గాయపడిన ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ త్వరగా కోలుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. కాకినాడలో జరుగుతున్న చిత్రీకరణలో బాలకృష్ణ గాయపడ్డారన్న విషయం తెలుసుకున్న సీఎం.. వెంటనే ఆయనకు ఫోన్ చేసి పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అపారమైన ఆత్మవిశ్వాసంతో బాలకృష్ణ మళ్లీ అదే ఉత్సాహంతో షూటింగ్‌లో పాల్గొంటారని ఆశిస్తున్నట్లు చంద్రబాబు తన ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్ చేశారు. మరోవైపు, బాలకృష్ణ త్వరగా కోలుకోవాలని మంత్రి నారా లోకేశ్‌తో పాటు సినీ నటులు జూనియర్ ఎన్టీఆర్, నందమూరి కల్యాణ్‌రామ్ ఆకాంక్షించారు. ఈ మేరకు వారు ఎక్స్ వేదికగా వేర్వేరు పోస్టులు చేశారు. కాకినాడలో జరుగుతున్న సినిమా షూటింగ్లో గాయపడిన మావయ్య నందమూరి బాలకృష్ణను ఫోన్‌లో పరామర్శించినట్లు మంత్రి నారా లోకేశ్ తెలిపారు. ప్రమాదం ఎలా జరిగిందో అడిగి తెలుసుకున్నానని, బాలా మావయ్య త్వరగా కోలుకుని, యథావిధిగా షూటింగ్‌లో పాల్గొంటారని ఆశిస్తున్నట్లు ట్వీట్ చేశారు.
తిరిగి గర్జించాలి..
‘బాలా బాబాయ్ మీరు త్వరగా కోలుకోవాలి. సంపూర్ణ ఆరోగ్యం, సామర్థ్యంతో తిరిగి గర్జించాలని అభిలషిస్తున్నాను’ అని జూనియర్ ఎన్టీఆర్ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు.
మళ్లీ యాక్షన్ మోడ్‌లోకి రావాలి
‘బాబాయ్ మీరు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా. మీరు అమితంగా ప్రేమించే పని చేయడానికి తక్కువ సమయంలోనే మళ్లీ యాక్షన్ మోడ్‌లోకి రావాలని కోరుకుంటున్నా’ అని హీరో కల్యాణ్‌రామ్ పేర్కొన్నారు.






