- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సంగారెడ్డిలో పేకాట స్థావరంపై రైడ్.. 16 మంది అరెస్ట్
ప్రభుత్వం నిషేధించిన మూడుముక్కలాట ఆడుతున్న 16 మంది వ్యక్తులను సంగారెడ్డి రూరల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

దిశ, సంగారెడ్డి అర్బన్ : ప్రభుత్వం నిషేధించిన మూడుముక్కలాట ఆడుతున్న 16 మంది వ్యక్తులను సంగారెడ్డి రూరల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.1,55,080 నగదు, 15 మొబైల్ ఫోన్లు, 52 ప్లేయింగ్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఆదేశాల మేరకు జిల్లాలో అక్రమ కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్న నేపథ్యంలో ఈ దాడి జరిగింది. సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అరుట్ల గ్రామ శివారులో సర్వే నంబర్ 44లో ఉన్న ఫామ్‌హౌస్‌లో కొందరు వ్యక్తులు డబ్బులు పెట్టి పేకాట ఆడుతున్నట్లు విశ్వసనీయ సమాచారం అందింది. సమాచారం మేరకు సంగారెడ్డి రూరల్ ఎస్‌ఐ మధుసూదన్ రెడ్డి పోలీసు సిబ్బందితో కలిసి ఫామ్‌హౌస్‌పై దాడి నిర్వహించారు. ఈ దాడిలో డబ్బులు పణంగా పెట్టి పేకాట ఆడుతున్న 16 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.
ఈ విషయమై సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ నెం. 444/2026, గేమింగ్ యాక్ట్ సెక్షన్‌లు 3, 4 కింద కేసు నమోదు చేసి, నిందితులకు భారతీయ నాగరిక భద్రతా సంహిత (బీఎన్‌ఎస్‌ఎస్) సెక్షన్ 35(3) ప్రకారం నోటీసులు జారీ చేసినట్లు ఎస్‌ఐ మధుసూదన్ రెడ్డి తెలిపారు. చట్టాన్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు అని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ హెచ్చరించారు. పేకాట, జూదం, మట్కా వంటి అక్రమ కార్యకలాపాలు చట్టరీత్యా నేరమని తెలిపారు. ఇటువంటి కార్యకలాపాలకు పాల్పడే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రజలు ఇలాంటి అక్రమ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, జిల్లాలో ఎక్కడైనా పేకాట, జూదం లేదా ఇతర అనుమానాస్పద కార్యకలాపాలు జరుగుతున్నట్లు తెలిసిన వెంటనే సంగారెడ్డి జిల్లా పోలీసు కంట్రోల్ రూమ్ నంబర్ 8712656739 లేదా డయల్ 100కు సమాచారం అందించాలని సూచించారు.






