- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రధాని నివాసం వద్ద ధర్నా కేసు.. మోడల్ టౌన్ పీఎస్ నుంచి రాహుల్ గాంధీ విడుదల
ప్రధాని నివాసం ఎదుట ధర్నా వేళ అరెస్ట్ అయిన రాహుల్ గాంధీ కాసేపటి క్రితం మోడల్ టౌన్ పీఎస్ నుంచి రిలీజ్ అయ్యారు.

దిశ, వెబ్‌డెస్క్: ‘నీట్’ పరీక్షలో అక్రమాలు, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో పాటు ప్రధాని రాజీనామా చేయాలని ఇవాళ విపక్ష నేతలు రాహుల్ గాంధీ (Rahul Gandhi) నేతృత్వంలో మల్లికార్జున్ ఖర్గే, ప్రియాంకా గాంధీతో పాటు మిత్రపక్ష నేతలు లోక్ కళ్యాణ్ మార్గ్‌లోని ప్రధాని నివాసం ఎదుట నిరసన తెలిపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వారి అరెస్టుల పర్వం తీవ్ర రాజకీయ దుమారానికి దారితీసింది. దీంతో పరిస్థితి చేదాటిపోతుండటంతో ఢిల్లీ పోలీసులు ప్రతిపక్ష నాయకులను అదుపులోకి తీసుకుని కొందరిని మందిర్ మార్గ్ పీఎస్‌కు, మరికొందరిని మోడల్ టౌన్ (Model Town) పీఎస్ తరలించారు. అయితే, కాసేపటి రాహుల్ గాంధీ పూచికత్తుపై మోడల్ టౌన్ పీఎస్ నుంచి విడదలయ్యారు.
మందిర్ మార్గ్ పీఎస్ నుంచి ప్రియాంకా విడుదల..
అదేవిధంగా మందిర్ మార్గ్ పీఎస్ నుంచి ఎంపీ ప్రియాంకా గాంధీ రిలీజ్ అయ్యారు. ఆమెతో పాటు సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖీలేష్ యాదవ్ కూడా ఉన్నారు. ఈ సందర్భంగా పీఎస్ నుంచి విడుదలైన తర్వాత కేంద్ర తీరును తప్పుబడుతూ ప్రియాంకా గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. విద్యార్థులకు తీరని అన్యాయం జరిగిందని అన్నారు. విద్యార్థులు చెప్పేది వినడంలో ఇబ్బంది ఏముంటుందని ప్రశ్నించారు. పోలీసులు వారిని ఇష్టం వచ్చినట్లుగా కొట్టారని.. పలువురు విద్యార్థులు కూడా తీవ్ర గాయాలయ్యాయని ఆరోపించారు. ఇక ఈ అంశాన్ని రేపు పార్లమెంట్‌లో ఖచ్చితంగా లేవనెత్తుతామని ఎస్పీ నేత, ఎంపీ అఖిలేష్ యాదవ్ అన్నారు.
ఇక, అంతకు ముందు మందిర్ మార్గ్ పోలీస్ స్టేషన్‌లో ఉన్న ప్రియాంకా గాంధీతో పాటు ఇతర నేతలను కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ పరామర్శించారు. ఢిల్లీ పోలీసుల చర్యలను కాంగ్రెస్ సహా ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా ఖండిస్తుండటంతో రాజధానిలో భద్రతను ఇప్పటికే మరింత కట్టుదిట్టం చేశారు.






