సింగపూర్‌ మ్యాథ్స్ ఒలింపియాడ్‌ విజేతలు ముంబై అన్నా చెల్లెల్లు

by Muthe.Rajitha |

సింగపూర్‌లో జరిగిన ప్రతిష్టాత్మక "సింగపూర్ ఇంటర్నేషనల్ మ్యాథ్ ఒలింపియాడ్ ఛాలెంజ్ (SIMOC) - 2026" పోటీలలో ముంబయికి చెందిన అన్నాచెల్లెళ్లు అద్భుత ప్రతిభను చాటారు.

సింగపూర్‌ మ్యాథ్స్ ఒలింపియాడ్‌ విజేతలు ముంబై అన్నా చెల్లెల్లు
X

దిశ, వెబ్ డెస్క్ : సింగపూర్‌లో జరిగిన ప్రతిష్టాత్మక "సింగపూర్ ఇంటర్నేషనల్ మ్యాథ్ ఒలింపియాడ్ ఛాలెంజ్ (SIMOC) - 2026" పోటీలలో ముంబయికి చెందిన అన్నాచెల్లెళ్లు అద్భుత ప్రతిభను చాటారు. 40 దేశాలకు చెందిన 2,285 మంది అత్యుత్తమ విద్యార్థులు పాల్గొన్న ఈ అంతర్జాతీయ పోటీలో వీరు ఏకంగా ఐదు పతకాలను సొంతం చేసుకుని దేశానికి గుర్తింపు తెచ్చారు. ముంబయిలోని డాన్ బాస్కో ఇంటర్నేషనల్ హైస్కూల్‌లో చదువుతున్న ఈ రిషీకేష్ అభినందన్ తుల్సియాన్, వేదాంశికా అభినందన్ తుల్సియాన్ అంతర్జాతీయ ఒలింపియాడ్‌కు ఎంపికయ్యారు. ఏడో తరగతి చదువుతున్న రిషీకేష్ వ్యక్తిగత రాత పరీక్షతో పాటు టీమ్ విభాగాలైన 'మ్యాథ్స్ వారియర్స్', 'మ్యాథ్ మాస్టర్ మైండ్' పోటీలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి మూడు రజత పతకాలను సాధించాడు.

ఇక మూడో తరగతి చదువుతున్న వేదాంశిక అభినందన్ తుల్సియాన్ ఒక రజత పతకం, ఒక కాంస్య పతకాన్ని గెలుచుకుంది. పోటీలు ముగిసిన అనంతరం విజేతల ప్రదానోత్సవంలో ఈ అన్నాచెల్లెళ్లిద్దరూ భారత త్రివర్ణ పతాకాన్ని ప్రదర్శించారు. చిన్న వయసులోనే గణితంలో వీరు చూపిన చొరవ, సాధించిన విజయాలపై పాఠశాల యాజమాన్యంతో పాటు పలువురు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

Next Story