సీజేఐ వ్యాఖ్యలపై వెల్లువెత్తుతున్న విమర్శలు

by Muthe.Rajitha |

సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ వ్యాఖ్యలపై నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు.

సీజేఐ వ్యాఖ్యలపై వెల్లువెత్తుతున్న విమర్శలు
X

దిశ, వెబ్ డెస్క్ : ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నీట్ (NEET) పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా పోరాడుతున్న విద్యార్థులపై పోలీసులు జరిపిన బలప్రయోగాన్ని సవాలు చేస్తూ దాఖలైన అత్యవసర పిటిషన్‌ను విచారించేందుకు సీజేఐ ధర్మాసనం నిరాకరించడం పెద్ద వివాదానికి దారితీసింది. పిటిషనర్ తరఫున విచారణకు హాజరైన న్యాయవాది, విద్యార్థులపై పోలీసులు జరిపిన దాడులకు సంబంధించిన స్పష్టమైన వీడియో ఆధారాలు ఉన్నాయని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లినప్పటికీ, "మా సమయాన్ని వృథా చేయకండి, వీడియోలు చూడటానికి మాకు సమయం లేదు" అంటూ సుప్రీంకోర్టు వ్యాఖ్యానించడంపై విద్యార్థి లోకం, న్యాయ నిపుణులు, విపక్షాలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి. సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ వ్యాఖ్యలపై నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు. అత్యున్నత న్యాయస్థాన జడ్జిగా ఎందుకు ఉన్నారని ధ్వజమెత్తుతున్నారు.

కేంద్ర ప్రభుత్వం మీడియాను, పోలీసులనే కాదు న్యాయవ్యవస్థను కొనేసిందని మండిపడుతున్నారు. దేశ భవిష్యత్తు, విద్యార్థుల హక్కుల పరిరక్షణ విషయంలో అత్యున్నత నాయస్థానం చూపిన ఈ ఉదాసీన వైఖరిపై 'క్రాక్‌రోచ్ జనతా పార్టీ' (CJP) నేతలతో పాటు ప్రధాన ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాయి. ప్రజాస్వామ్యంలో రాజ్యాంగబద్ధంగా నిరసన తెలిపే హక్కును కాలరాస్తూ పోలీసులు చేసిన భౌతిక దాడులపై అత్యవసరంగా స్పందించాల్సిన సుప్రీంకోర్టు, విద్యార్థుల వేదనను వినకుండా పిటిషన్‌ను తిరస్కరించడం తీవ్ర విచారకరమని మండిపడ్డాయి. బాధితులకు న్యాయం అందించాల్సిన స్థానంలో ఉన్న న్యాయమూర్తులు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చట్టంపై, న్యాయ వ్యవస్థపై సామాన్యులకు ఉన్న విశ్వాసాన్ని దెబ్బతీస్తుందని ఆందోళన వ్యక్తం చేశాయి.

Next Story