- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
J&K: అనంతనాగ్‌లో విధుల్లో ఉన్న పోలీసును కాల్చిచంపిన ఉగ్రవాది
తీవ్రంగా గాయపడిన ఖురేషిని (బుద్గామ్ జిల్లా నివాసి) అనంతనాగ్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు.

దిశ, నేషనల్ బ్యూరో: గత ఏడాది 26 మంది ప్రాణాలు తీసిన పహల్గామ్ ఘటన తర్వాత జమ్మూకశ్మీర్‌లో మళ్ళీ ఉగ్రవాద దాడి జరిగింది. బుధవారం అనంతనాగ్‌లోని లాల్ చౌక్ దగ్గర పెట్రోలింగ్ విధుల్లో ఉన్న ఇండియా రిజర్వ్ (ఐఆర్) 3వ బెటాలియన్ కానిస్టేబుల్, 35 ఏళ్ల ఆషిక్ హుస్సేన్ ఖురేషిపై బైక్‌పై వచ్చిన ఒక ఉగ్రవాది అకస్మాత్తుగా కాల్పులు జరిపి పారిపోయాడు. తీవ్రంగా గాయపడిన ఖురేషిని (బుద్గామ్ జిల్లా నివాసి) అనంతనాగ్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. ఈ దాడికి లష్కర్-ఎ-తైబాకు అనుబంధంగా భావించే ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (టీఆర్ఎఫ్) ఈ దాడికి తామే బాధ్యులమని సోషల్ మీడియాలో ప్రకటించింది. భద్రతా దళాలు చేపట్టిన 'ఆపరేషన్ సింధూర్'తో లోయ అంతటా కట్టుదిట్టమైన భద్రత ఉన్నప్పటికీ ఈ ఘటన జరగడం కలకలం రేపింది. ప్రస్తుతం సైన్యం ఆ ప్రాంతాన్ని పూర్తిగా దిగ్బంధించి, అదనపు బలగాలను మోహరించి, దాడి చేసిన ఉగ్రవాదిని పట్టుకునేందుకు భారీ గాలింపు చేపట్టాయి.






