- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సమ్మక్క సాగర్ 8 గేట్లు ఓపెన్
by Batti.Sumithra |
ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం గుట్టలగంగారం గ్రామ పరిధిలోని దేవాదుల పంప్‌హౌస్ నుంచి 9 మోటార్ల ద్వారా భీంఘణపూర్ రిజర్వాయర్‌లోకి 2,306 క్యూసెక్కుల నీటిని పంపింగ్ చేస్తున్నట్లు ఇరిగేషన్ అధికారులు తెలిపారు.

X
దిశ, కన్నాయిగూడెం : ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం గుట్టలగంగారం గ్రామ పరిధిలోని దేవాదుల పంప్‌హౌస్ నుంచి 9 మోటార్ల ద్వారా భీంఘణపూర్ రిజర్వాయర్‌లోకి 2,306 క్యూసెక్కుల నీటిని పంపింగ్ చేస్తున్నట్లు ఇరిగేషన్ అధికారులు తెలిపారు. తుపాకులగూడెం వద్ద ఉన్న సమ్మక్క సాగర్ బ్యారేజీలో పూర్తి నీటి మట్టం 83 మీటర్లు కాగా, ప్రస్తుతం నీటి మట్టం 76.5 మీటర్లుగా ఉందని తెలిపారు. అలాగే 6.94 టీఎంసీల నిల్వ సామర్థ్యానికి గాను ప్రస్తుతం 2.03 టీఎంసీల నీరు నిల్వ ఉందని ఇరిగేషన్ డీఈ శరత్‌బాబు, ఏఈఈ మాణికుమార్ తెలిపారు. సమ్మక్క సాగర్ బ్యారేజీ వద్ద మొత్తం 59 గేట్లకు గాను 8 గేట్లను ఎత్తి, 37,894 క్యూసెక్కుల నీటిని దిగువ ప్రాంతాలకు విడుదల చేస్తున్నట్లు ఇరిగేషన్ అధికారులు తెలిపారు.
Next Story






