ఉద్యమంలో అర్చకుల సేవలకు ప్రశంసలు.. డిమాండ్లపై సానుకూలంగా స్పందించిన కమిటీ

by Ramesh Naini |

తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ వరుస సమావేశాల్లో భాగంగా బుధవారం అమరవీరుల స్మారక చిహ్నం (అమరదీపం)లో రాష్ట్ర వ్యాప్తంగా మలిదశ ఉద్యమంలో ఆధ్యాత్మిక రంగాన్ని ఏకం చేసి రాష్ట్ర సాధన కోసం ఉద్యమించిన అర్చకులు, గిరిజన అర్చకుల ప్రతినిధులతో సమావేశాన్ని నిర్వహించింది.

ఉద్యమంలో అర్చకుల సేవలకు ప్రశంసలు.. డిమాండ్లపై సానుకూలంగా స్పందించిన కమిటీ
X

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ మలిదశ ఉద్యమంలో ఆధ్యాత్మిక రంగాన్ని ఏకం చేసి స్వరాష్ట్ర కాంక్షను రగిలించిన అర్చకులు, గిరిజన అర్చకులతో 'తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ' బుధవారం అమరవీరుల స్మారక చిహ్నం (అమరదీపం) వద్ద సమావేశమైంది. ఈ భేటీలో కమిటీ సభ్యులు ఎమ్మెల్సీ ప్రొఫెసర్ ఎం. కోదండరామ్, మోతె శోభన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఎస్. రాములు నాయక్ పాల్గొని అర్చకుల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు. ఉద్యమంలో ఆధ్యాత్మిక చైతన్యం ద్వారా వారు పోషించిన పాత్రను ఈ సందర్భంగా సభ్యులు కొనియాడారు.

అర్చకులు కమిటీ ప్రధాన డిమాండ్లు.

నిధుల పెంపు: ఆలయాల నిర్వహణ కోసం ప్రభుత్వం అందిస్తున్న 'ధూప దీప నైవేద్యం' ఆర్థిక సాయాన్ని తక్షణమే పెంచాలి. అర్చకుల పిల్లలకు వేద విద్యతో పాటు నాణ్యమైన సాధారణ విద్యను పూర్తిగా ఉచితంగా అందించాలి. నిరుపేద గిరిజన, ఇతర అర్చక కుటుంబాలకు 250 గజాల నివాస భూమిని కేటాయించి ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయాలి. అత్యవసర పరిస్థితుల్లో అపరిమిత ఉచిత వైద్యం అందేలా ప్రత్యేక డిజిటల్ హెల్త్ కార్డులు జారీ చేయాలి. ఈ వినతులపై స్పందించిన కమిటీ సభ్యులు.. భత్యం పెంపుదల, ఉచిత విద్య, ఇళ్ల స్థలాలు, హెల్త్ కార్డుల కోసం అర్చక స్వాములు కోరిన ప్రతి డిమాండ్‌ అత్యంత న్యాయమైనదని స్పష్టం చేశారు.

Next Story