దొంగతనం కేసులో పాత నేరస్థుడు అరెస్ట్

by Batti.Sumithra |

దొంగతనం కేసులో తప్పించుకుని తిరుగుతున్న ఓ పాత నేరస్థుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

దొంగతనం కేసులో పాత నేరస్థుడు అరెస్ట్
X

దిశ, జవహర్‌నగర్ : దొంగతనం కేసులో తప్పించుకుని తిరుగుతున్న ఓ పాత నేరస్థుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్‌హెచ్‌ఓ సైదులు తెలిపిన వివరాల ప్రకారం జవహర్‌నగర్ బీజేఆర్ నగర్‌లోని పోచమ్మ దేవాలయం సమీపంలో మగెడ సత్యనారాయణ (43) నివసిస్తున్నాడు. స్థానికంగా ప్లంబర్ పనులు చేసుకుంటూ జీవనం సాగించేవాడు. తాళం వేసి ఉన్న ఇళ్లనే లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడేవాడు. వాహనాలను సైతం ఎత్తుకెళ్లి, వాటి నంబర్ ప్లేట్లను మార్చుతూ విక్రయించి సొమ్ము చేసుకుంటూ విలాసవంతమైన జీవితానికి అలవాటుపడ్డాడు.

2026 డిసెంబర్ 11న యాప్రాల్ సాయి ఎన్‌క్లేవ్ ప్రాంతంలో ఓ ఇంటి తలుపులు పగులగొట్టి విలువైన వస్తువులతో పాటు రూ.4.50 లక్షల నగదును దొంగిలించినట్లు తెలిపారు. దొంగతనాలకు పాల్పడి సంపాదించిన సొత్తులో భాగంగా 32 తులాల బంగారు ఆభరణాలు, 270 తులాల వెండి వస్తువులు, 5 తులాల ప్లాటీనం వస్తువులను స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. ఇటీవల పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా కనిపించిన ఓ వాహనదారుడిని విచారించగా, దొంగతనం కేసును ఒప్పుకున్నాడు. నిందితుడు మగెడ సత్యనారాయణను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించగా, మరో నిందితుడు మాణిక్ చంద్ పరారీలో ఉన్నాడని తెలిపారు. నిందితుల పై జవహర్‌నగర్, కీసర, కుషాయిగూడ పోలీస్ స్టేషన్లలో పలు కేసులు నమోదై ఉన్నాయని పేర్కొన్నారు. దొంగతనం కేసును ఛేదించిన పోలీసు అధికారులను ఉన్నతాధికారులు అభినందించారు. ఈ కార్యక్రమంలో డిటెక్టివ్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్‌తో పాటు పోలీసులు పాల్గొన్నారు.

Next Story