- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
DC Trailer : డైరెక్టర్ నుంచి హీరోగా... లోకేశ్ కొత్త అవతారం!
హీరోగా లోకేశ్ కనగరాజ్ నటించిన డీసీ తెలుగు ట్రైలర్ రిలీజ్ వచ్చేసింది.

దిశ, వెబ్ డెస్క్: తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్ గురించి ఈ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎంతో మంది తమిళ స్టార్ హీరోలతో సినిమాలు చేసి... బంపర్ హిట్లు అందుకున్నారు. తెలుగులో రాజమౌళి ఎలా ఇండస్ట్రీని రూల్ చేస్తున్నారో... అచ్చం అలాగే తమిళ ఇండస్ట్రీని దున్నేస్తున్నారు. అయితే అలాంటి దమ్మున్న దర్శకుడు లోకేష్ కనగరాజ్ ఇప్పుడు హీరోగా మారిపోయారు. ఆయన తొలిసారిగా లీడ్ రోల్ చేసిన మూవీ డీసీ. అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో హీరోగా లోకేష్ కనిపించనుండగా... వామికా గబ్బి హీరోయిన్ గా మెరువనున్నారు. అయితే ఈ సినిమా నుంచి లేటెస్ట్ గా ట్రైలర్ రిలీజ్ అయింది. ఈ సినిమాలో దేవదాస్ గా లోకేష్ కనగరాజ్ కనిపించగా... హీరోయిన్ వామికా చంద్ర అనే యువతి పాత్రలో కనిపిస్తారు. ఇక ఈ చంద్రకు సపోర్ట్ గా నిలుస్తూ దేవదాసు చేసే పనులను ఈ సినిమాలో చాలా చక్కగా చూపించినట్లు తెలుస్తోంది. అటు విజువల్స్ తో పాటు అనిరుధ్ మ్యూజిక్ కూడా ట్రైలర్ కు హైప్ తీసుకొచ్చింది.






