TG EAPCET: విద్యార్థులకు బిగ్ అలర్ట్.. రెండో విడత కౌన్సెలింగ్ ఫలితాలు విడుదల

by Kema Shiva Kumar |   (  Updated:2026-07-22 17:23:04  IST  )

విద్యార్థులు ఎంతగానో ఎదురుచూస్తున్న టీజీ ఈఏపీసెట్ ఇంజినీరింగ్ రెండో విడత కౌన్సెలింగ్ ఫలితాలు ఎట్టకేలకు విడదలయ్యాయి.

TG EAPCET: విద్యార్థులకు బిగ్ అలర్ట్.. రెండో విడత కౌన్సెలింగ్ ఫలితాలు విడుదల
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ఈఏపీసెట్ (TG EAPCET) ఇంజినీరింగ్ రెండో విడత కౌన్సెలింగ్ ఫలితాలను రాష్ట్ర ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. మొదటి విడత కౌన్సెలింగ్‌లో కోరుకున్న సీటు రాని విద్యార్థులతో పాటు కొత్తగా ఆప్షన్లు నమోదు చేసుకున్న సుమారు 60 వేల మంది విద్యార్థులు సెకండ్ ఫేజ్‌లో వెబ్ ఆప్షన్లను ఎంచుకున్నారు. వారి మెరిట్, రిజర్వేషన్, ప్రాధాన్యతల ఆధారంగా కళాశాలలు, కోర్సులను కేటాయిస్తూ అలాట్‌మెంట్ ఆర్డర్లను (Seat Allotment Orders) అధికారులు జారీ చేశారు.

అలాట్‌మెంట్ ఆర్డర్ డౌన్‌లోడ్ చేసుకోండి ఇలా..

విద్యార్థులు మొదట తెలంగాణ ఈఏపీసెట్ అధికారిక వెబ్‌సైట్ tgeapcet.nic.in‌లోకి వెళ్లాలి. హోమ్‌పేజీలో ఉన్న Candidate Login ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. అభ్యర్థి లాగిన్ ఐడీ, హాల్ టికెట్ నంబర్, పాస్‌వర్డ్. పుట్టిన తేదీ వివరాలను నమోదు చేసి లాగిన్ అవ్వాలి. అనంతరం స్క్రీన్‌పై కనిపించే Seat Allotment Order‌ పై క్లిక్ చేసి, మీ అలాట్‌మెంట్ ఆర్డర్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని అధికారుల సూచించారు. ఇక కౌన్సెలింగ్ ఫలితాల ఆధారంగా సీటు పొందిన విద్యార్థులు నిర్దేశిత గడువులోగా ఆన్‌లైన్ ట్యూషన్ ఫీజు చెల్లించి, అలాట్‌మెంట్ లెటర్‌తో కేటాయించిన కళాశాలలో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.

Next Story