- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మీ పిల్లలకు పాత ఎలక్ట్రానిక్ పరికరాలు ఇస్తున్నారా? బీ కేర్ఫుల్
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలం గూడెం గ్రామంలో బ్యాటరీ పేలి బాలుడు మృతి చెందిన ఘటన తీవ్ర కలకలం రేపింది.

దిశ, వెబ్ డెస్క్ : కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలం గూడెం గ్రామంలో బ్యాటరీ పేలి బాలుడు మృతి చెందిన ఘటన తీవ్ర కలకలం రేపింది. నికార్డి లోకేష్ అనే 14 ఏళ్ల బాలుడు బుధవారం ఉదయం ఇంట్లో ఆడుకుంటూ, గుర్తు తెలియని బ్యాటరీని నోటితో కొరకడంతో బ్యాటరీ పేలి ముఖం, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. వైద్యం కోసం ఆసుపత్రికి తరలిస్తుండగానే బాలుడు మృతి చెందాడు. కాగా సరదాగా పిల్లలు ఆడుకునే వస్తువు బాలుని ప్రాణం తీయడం సంచలనం సృష్టించింది. పాత ఫోన్లు, ఉబ్బిపోయిన బ్యాటరీలు, పాడై పోయిన ఎలక్ట్రానిక్ పరికరాలు, వాడని లాప్టాప్స్ పిల్లలకు దూరంగా ఉంచాలని అధికారులు సూచించారు. అయితే చింతలమానేపల్లి సరిహద్దుల్లో పాత మొబైల్, ల్యాప్టాప్స్ బ్యాటరీల్లోని కాపర్, స్క్రాప్ అమ్మే అక్రమ వ్యాపారులు ఉన్నారు. ఆ పరిసరాల్లో పడేసిన బ్యాటరీని తెచ్చుకొని ఆడుకుంటున్నపుడే అది పేలి లోకేష్ మృతి చెందాడని పోలీసులు భావిస్తున్నారు.






