రాజా రఘువంశీ హత్య కేసు.. ప్రధాన నిందితురాలకి సుప్రీంకోర్టు సంచలన ఆప్షన్లు!

by Malleboina Mahesh |

రాజా రఘువంశీ హత్య కేసు (Raja Raghuvanshi murder case)లో ప్రధాన నింధితిరాలు సుప్రీం కోర్టు (Supreme Court) రెండు సంచలన ఆప్షన్లను పెట్టి ఉహించని షాక్ ఇచ్చింది.

రాజా రఘువంశీ హత్య కేసు.. ప్రధాన నిందితురాలకి సుప్రీంకోర్టు సంచలన ఆప్షన్లు!
X

దిశ, వెబ్ డెస్క్: దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారీ తీసిన రాజా రఘువంశీ హత్య కేసు (Raja Raghuvanshi murder case)లో ప్రధాన నింధితరాలికి సుప్రీం కోర్టు (Supreme Court) రెండు సంచలన ఆప్షన్లను ఇచ్చింది. పక్కా ప్రణాళికతో తన భర్త రాజా రఘువంశీని దారుణంగా హత్య చేయించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రధాన నిందితురాలు సోనమ్ రఘువంశీకి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. మేఘాలయ హైకోర్టు ఆమెకు మంజూరు చేసిన బెయిల్‌ను రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం వేసిన పిటిషన్‌పై జస్టిస్ ఎం.ఎం. సుందరేష్, జస్టిస్ పి.బి. వరాలేల ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా సోనమ్ న్యాయవాదికి కోర్టు రెండు ఆప్షన్లు ఇచ్చింది. బెయిల్ రద్దుపై పూర్తిస్థాయి విచారణ జరిపి కోర్టు నేరుగా తీర్పు ఇవ్వడం, రెండు సాక్షుల విచారణ జరిగే వరకు సోనమ్ వెంటనే కోర్టుకు సరెండర్ అవ్వాలని ఆప్షన్స్ ఇచ్చింది. దీంతో కోర్టు తీర్పుపై గురువారంలోగా తమ నిర్ణయం చెబుతామని నిందితురాలి లాయర్ తెలిపారు.

విచారణ సమయంలో మేఘాలయ ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తీవ్ర వాదనలు వినిపించారు. సోనమ్ స్వయంగా పోలీసుల వద్దకు వచ్చి లొంగిపోయినందున, ఆమెకు అరెస్టు కారణాలు తెలపలేదనే సాంకేతిక సాకుతో బెయిల్ ఇవ్వడం సరికాదని స్పష్టం చేశారు. స్వయంగా వచ్చి లొంగిపోయిన నిందితులకు అరెస్ట్ కారణాలు చూపించాల్సిన నిబంధన వర్తించదని తెలిపారు. హత్య జరిగిన తర్వాత సోనమ్ ప్రవర్తించిన తీరుపై కూడా సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ విచారణను వాయిదా వేసింది.

Next Story