- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌ను పరిశీలించనున్న కేంద్ర ఉన్నతాధికారుల బృందం
నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలో నిర్మిస్తున్న దిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు అవసరమైన అటవీ భూమి, ముంపు ప్రాంతాలపై అధ్యయనం చేసేందుకు కేంద్ర అటవీశాఖ ఉన్నతాధికారుల బృందం సమీక్ష నిర్వహించింది.

దిశ,అచ్చంపేట: నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలో నిర్మిస్తున్న దిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు అవసరమైన అటవీ భూమి, ముంపు ప్రాంతాలపై అధ్యయనం చేసేందుకు కేంద్ర అటవీశాఖ ఉన్నతాధికారుల బృందం సమీక్ష నిర్వహించింది. ఈ రోజు(మంగళవారం) అమ్రాబాద్ మండలం మన్ననూర్ అటవీశాఖ ఫీల్డ్ డైరెక్టర్ కార్యాలయం వద్ద కేంద్ర ప్రభుత్వ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫారెస్ట్స్, డిఐజి ఆఫ్ ఫారెస్ట్(IFS), కె.గణేష్ కుమార్, అసిస్టెంట్ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫారెస్ట్స్ రంగస్వామి నేతృత్వంలోని బృందం, శ్రీశైలం ప్రాజెక్టు ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులతో కలిసి ముందుగా అధికారులతో సమీక్ష నిర్వహించింది. ఈ సందర్భంగా ప్రాజెక్టుకు ఎంత మేర అటవీ భూమి అవసరమవుతుంది? భవిష్యత్తులో భూసేకరణ అంచనాలు పెరిగే అవకాశం ఉందా? అటవీ భూమి అవసరానికి గల కారణాలపై అధికారులు వివరాలు సేకరించారు.
అనంతరం దిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ముంపు ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు బృందం బయలుదేరింది. ప్రస్తుతం నాగర్‌కర్నూల్ జిల్లాలో అటవీ శాఖకు సంబంధించిన సుమారు 35 హెక్టార్లు, నల్గొండ జిల్లాలో 140 హెక్టార్ల అటవీ భూమి ముంపునకు గురవుతున్న ప్రాంతాలను పరిశీలించి నివేదిక సిద్ధం చేయనున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అటవీశాఖ అధికారి రేవంత్ చంద్ర, ఇరిగేషన్ శాఖ ఉన్నత అధికారులు, డీఈలు శ్రీనివాసులు, చక్రపాణి, అటవీ శాఖ క్షేత్ర అధికారులు తదితరులు పాల్గొన్నారు.






