- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏన్కూర్ మండలంలో 15 మహిళా భవనాలు నిర్మాణం
మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం స్వయం సహాయక సంఘాలను బలోపేతం చేసే విధంగా కృషి చేస్తుంది.

దిశ, ఏన్కూర్: మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం స్వయం సహాయక సంఘాలను బలోపేతం చేసే విధంగా కృషి చేస్తుంది. గ్రామాల్లో మహిళలు సంఘ సమావేశాలు నిర్వహించుకుని, సంఘాన్ని బలోపేతం చేసేందుకు మహిళలందరూ ఒకే దగ్గర కూర్చునేందుకు వీలుగా జాతీయ ఉపాధి హామీ పథకంలో భాగంగా ఏనుకూరు మండలంలో సుమారు 15 మహిళ భవనాలు నిర్మాణాలు వేగవంతంగా జరుగుతున్నాయి. గ్రామ పంచాయతీలో మహిళా సంఘ సభ్యులు నెలవారి మీటింగ్ నిర్వహించుకునేందుకు మహిళా భవనాలు ఎంతగానో దోహదపడతాయని మహిళా సంఘం సభ్యులు అభిప్రాయం వ్యక్తం చేశారు.
భవనాలు లేకపోవడం వల్ల ఎక్కడో చెట్ల దగ్గర లేక మహిళా సంఘం సభ్యులు ఇండ్ల దగ్గర సంఘ సమావేశాలు నిర్వహించుకోవడం ఇబ్బందికరంగా ఉండటంతో మండలంలో ఒక్కొక్క భవన నిర్మాణానికి ఎన్ఆర్ఈజీఎస్ నిధుల కింద పది లక్షల రూపాయలు నిధులు మంజూరు అయినట్లు పంచాయతీరాజ్ తెలిపారు. నాణ్యతతో భవనాలను సకాలంలో పూర్తి చేసి భవనాలను మహిళా సంఘాలకు అప్పజెప్పేందుకు భవన నిర్మాణ పనులను వేగవంతం చేస్తున్నామని పంచాయతీ ఏఈ సూర్యనారాయణ తెలిపారు.






