- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇలాంటి పాత్రలు చేయడం చాలా కష్టం.. అందుకే మొదట చాలా భయపడ్డానంటూ సిద్ధార్థ్ ఎమోషనల్
అమరవీరుల పాత్రలు చేయడం చాలా కష్టం, ఎందుకంటే తమను ఎలా చూపించారో చూడటానికి వారు ఇప్పుడు మన మధ్య లేరు.

దిశ, సినిమా: సిద్ధార్థ్, జిమ్మీ షెర్‌గిల్, దియా మీర్జా, ప్రాజక్తా కోలీ, అభయ్ వర్మ ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ సిరీస్ ‘ఆపరేషన్ సేఫ్డ్ సాగర్’. 1999లో జరిగిన కార్గిల్ యుద్ధంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేసిన గొప్ప పోరాటం ఆధారంగా నెట్‌ఫ్లిక్స్ ఈ వెబ్ సిరీస్‌ను తీసుకొస్తోంది. ఈ భారీ బడ్జెట్ యుద్ధం డ్రామా సిరీస్‌కు ఓని సేన్ దర్శకత్వం వహించారు.షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సీరిస్ ఆగస్ట్ 7న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో.. తాజాగా, మేకర్స్ ‘ఆపరేషన్ సేఫ్డ్ సాగర్’ ట్రైలర్‌ను రియల్ లైఫ్ హీరోలు, వారి కుటుంబ సభ్యుల సమక్షంలో లాంచ్ చేశారు. ఈ ఈవెంట్‌లో అమరవీరుడు, స్క్వాడ్రన్ లీడర్ అజయ్ అహుజా పాత్రలో నటించిన హీరో సిద్ధార్థ్ తీవ్ర భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నారు.
"అమరవీరుల పాత్రలు చేయడం చాలా కష్టం, ఎందుకంటే తమను ఎలా చూపించారో చూడటానికి వారు ఇప్పుడు మన మధ్య లేరు. నిజమైన కథలకు న్యాయం చేయలేనేమోనని మొదట భయపడ్డాను. కానీ అజయ్ అహుజా గారి భార్య అల్కా అహుజా గారు ఓకే చెప్పాకే ఈ పాత్ర చేయడానికి ఒప్పుకున్నాను. దేశం కోసం ప్రాణాలర్పించిన అజయ్ అహుజా గారి పాత్రలో నటించడం నాకు లభించిన గొప్ప గౌరవం. ఆయన పాత్రకు పూర్తి న్యాయం చేయడానికి చాలా కష్టపడ్డాను" అని సిద్ధార్థ్ తెలిపారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే ఇందులో ఆయన చేతికి కట్టుతో కనిపించడంతో ఆయనకు ఏమైందోనని అభిమానులు ఆందోళన చెందుతున్నారు.






