- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎల్‌నినో హెచ్చరిక.. ప్రత్యామ్నాయ పంటలే రైతులకు రక్ష!
ఎల్‌నినో ప్రభావంతో ఈ ఖరీఫ్ సీజన్‌లో సాధారణం కంటే వర్షపాతం తక్కువగా నమోదయ్యే అవకాశం ఉన్నందున రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలని నారాయణపేట రైతు విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ డా. ఈటెల సత్యనారాయణ సూచించారు.

దిశ, ఊట్కూర్: ఎల్‌నినో ప్రభావంతో ఈ ఖరీఫ్ సీజన్‌లో సాధారణం కంటే వర్షపాతం తక్కువగా నమోదయ్యే అవకాశం ఉన్నందున రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలని నారాయణపేట రైతు విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ డా. ఈటెల సత్యనారాయణ సూచించారు. మండలంలోని అమీన్‌పూర్ గ్రామంలో రైతులకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
వర్షాధార ప్రాంతాల్లో అధిక నీటి అవసరమున్న పంటలకు బదులుగా తక్కువ వ్యవధిలో తక్కువ నీటితో సాగు చేయగల కంది, పెసర, మినుము, ఉలవలు, సజ్జలు, రాగులు, పొద్దుతిరుగుడు, ఆముదం, నువ్వులు వంటి పంటలను సాగు చేయాలని సూచించారు. ఈ పంటలు తక్కువ వర్షపాత పరిస్థితులను తట్టుకుని రైతులకు మెరుగైన దిగుబడితో పాటు స్థిరమైన ఆదాయాన్ని అందిస్తాయని తెలిపారు. నాణ్యమైన విత్తనాల వినియోగం, నేల పరీక్షల ఆధారంగా ఎరువుల యాజమాన్యం, కలుపు నివారణ, సమగ్ర చీడపీడల నివారణ చర్యలు చేపట్టడం ద్వారా సాగు ఖర్చులు తగ్గించి అధిక లాభాలు పొందవచ్చని వివరించారు. మక్తల్ వ్యవసాయ సహాయ సంచాలకులు నాగేష్ కుమార్, మండల వ్యవసాయ అధికారి గణేష్ రెడ్డి, అమీన్‌పూర్ వ్యవసాయ విస్తరణ అధికారి రజితతో పాటు పలువురు రైతులు పాల్గొన్నారు.






