గ్రేటర్‌లో నకి‘లీలలు’

by velandi.Saikiran |   (  Updated:2026-07-20 23:00:31  IST  )

అక్రమ నిర్మాణాలకు ఆదిభట్ల సర్కిల్ అడ్డాగా మా రిందనే ఆరోపణలు రోజురోజుకూ బలపడుతున్నాయి.

గ్రేటర్‌లో నకి‘లీలలు’
X

దిశ, హైదరాబాద్ బ్యూరో : గ్రేటర్ హైదరాబాద్‌లో పేరొందిన కంపెనీ ఉత్పత్తుల ను పోలిన నకిలీ ఉత్పత్తులను విచ్చలవిడిగా విక్రయిస్తున్నారు. టీ పొడి, నె య్యి, పాలు, నూనెలు, కిరాణా వ స్తువులు, పప్పుదినుసులు, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్, విద్యుత్ పరికరాలు, టీవీ లు, కంప్యూటర్లు, మిక్సీలు, గ్రైండర్లు ఇలా ఒక్కటేమిటీ అన్ని రకాల నిత్యావసరాలను అచ్చు గుద్దినట్లు అసలు ను పోలిన నకిలీ వస్తువులను తయా రు చేసి అమ్ముతూ ప్రజలను నిలువుదోపిడీ చేస్తున్నారు. పెద్ద కంపెనీల లేబుళ్లను ఎలాంటి అనుమతులు లే కుండా ఇల్లీగల్‌గా తాము తయారు చేసిన వస్తువులకు వేసి బహిరంగంగా అమ్ముతున్నారు. ఇది తెలియని కొనుగోలుదారులు అవే ఒరిజినల్ అ నుకొని కొని దారుణంగా మోసపోతున్నారు. ఇలాంటి అమ్మకాలకు ప్రము ఖ వ్యాపార కేంద్రాలైన బేగంబజార్, ట్రూప్ బజార్, మహరాజ్ గంజ్, బ్యాంక్ స్ట్రీట్, గుజరాతీగల్లీ, రాణిగం జ్, జాంబాగ్ మార్కెట్లు అడ్డాలుగా మారుతున్నాయి. దాడులు చేసి డూప్లి కేట్ అమ్మకందార్లపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు వీరి వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతోంది. అధికారులు మామూళ్ల మత్తులో జోగుతున్నారనే ఆరోపణలు సైతం వినబడుతున్నాయి. ఎప్పుడో ఒ కసారి తూతూ మంత్రంగా దాడులు చేస్తూ చేతులు దులుపుకుంటుండడం తో నకిలీల బెడద తప్పడం లేదని సా ధారణ ప్రజలు మండిపడుతున్నారు .

హోల్ సేల్ మార్కెట్లలో అడ్డగోలు విక్రయాలు..?

బేగంబజార్, మహరాజ్ గంజ్ మా ర్కెట్లకు అన్ని రకాల వస్తువులు విక్ర యించే హోల్ సేల్ మార్కెట్లుగా గు ర్తింపు పొందాయి. ఇక్కడ పెద్ద సం ఖ్యలో హోల్ సేల్ దుకాణాలు ఉండ గా జంటనగరాలతో పాటు జిల్లాల నుంచి కూడా కొనుగోలు కోసం వ స్తుంటారు. ప్రతినిత్యం కొనుగోలుదారులతో కిక్కిరిసిపోయే మార్కెట్ల లో నిత్యం కోట్లాది రూపాయల విక్రయా లు జరుగుతుంటాయి. ఇంతటి పేరు న్న మార్కెట్లపై అధికారులు దాడులు మరచిపోవడంతో నిర్వాహకులు నకిలీ వస్తువుల విక్రయాలకు తెరలేపారు. ఈ నేపథ్యంలో అధికారులకు అందిన ఫిర్యాదులతో గతంలో మార్కెట్‌లోని కొన్ని హోల్ సేల్ దుకాణాలపై దాడు లు చేయగా విస్తుపోయే వాస్తవాలు వె లుగు చూశాయి. లక్షలాది రూపా యల నకిలీ గృహాపకరణాలు పట్టుబడడంతో అధికారులు సైతం షాక్ తిన్నారు .

నిలువు దోపిడీ..?

నకిలీ వస్తువులు విక్రయించే వ్యాపారులు ప్రజలను నిలువు దోపి డీ చేస్తున్నారు. పేరొందిన ఏ కంపెనీ బ్రాండ్ ల పేరుతోనైనా నకిలీవి తయారు చేసి విక్రయించడం వీరికి వెన్నతో పెట్టిన విద్య. ముఖ్యంగా బ్రాండ్ యజమాని అనుమతి లేకుండా చట్టవిరుద్ధంగా తయారు చేస్తూ నిత్యం లక్షలాది రూపాయల అక్రమార్జనకు పాల్పడుతున్నారు. కంపెనీలు తయారు చేసిన అసలు వస్తువుల మాధిరిగానే పేర్లు, లేబుల్స్ ఉంటుండడంతో కొ నుగోలుదారులు వీటిని చూసి బో ల్తా పడుతున్నారు. దీనికితోడు నకి లీ వస్తువుల తయారీ, విక్రయదారు లు డిస్కౌంట్లు , ఆఫర్లు అంటూ మ భ్యపెడుతూ బహింరంగ విక్రయా లు చేపడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు నగరంలోని పేరొం దిన మార్కెట్లలోని హోల్ సేల్ దుకాణాలపై తరచుగా దాడులు చేసి నకిలీ ప్రొడక్ట్స్ అమ్మకుండా కఠిన చర్యలు తీసుకోవాలనే అభిప్రాయాలను నగర ప్రజలు వ్యక్తం చేస్తున్నారు

Next Story