- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇంటిలో అగ్నిప్రమాదం.. ముగ్గురు దుర్మరణం
సౌత్ ఢిల్లీలోని లోధి రోడ్ పరిధిలో ఉన్న బి.కె.దత్ కాలనీలో మంగళవారం ఉదయం అగ్నిప్రమాదం జరిగింది.

దిశ, వెబ్‌డెస్క్: సౌత్ ఢిల్లీలోని లోధి రోడ్ పరిధిలో ఉన్న బి.కె.దత్ కాలనీలో మంగళవారం ఉదయం అగ్నిప్రమాదం జరిగింది. ఓ ఇంట్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగగా.. ఇద్దరు పిల్లలు సహా ఓ మహిళ దుర్మరణం చెందినట్లు అగ్నిమాపకశాఖ అధికారులు వెల్లడించారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. బి.కె.దత్ కాలనీ బి-బ్లాక్, చావ్లా స్వీట్స్ ఎదురుగా ఉన్న భవనంలో మంటలు చెలరేగినట్లు ఫైర్ కంట్రోల్ రూమ్ కు స్థానికులు సమాచారం ఇచ్చారు. దీంతో ఫైరింజన్లు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నాయి. భవనంలోని మూడవ అంతస్తులో ఉన్న ఇంటిలో మంటలు చెలరేగగా.. ముగ్గురి మృతదేహాలను గుర్తించారు. వారికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు. కాగా.. గ్యాస్ సిలిండర్ పేలడంతోనే మంటలు చెలరేగినట్లుగా అనుమానిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టమ్ నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.






