- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఢిల్లీలో టెన్షన్ టెన్షన్.. రాహుల్ గాంధీని అదుపులోకి తీసుకున్న పోలీసులు
ప్రధాని మోడీ నివాసం వద్ద మరోసారి ఉద్రిక్తత నెలకొంది. నీట్ పేపర్ లీక్ పై విద్యార్థులకు మద్దతు ఇస్తూ ప్రధాని నివాసాన్ని ముట్టడించిన రాహుల్ గాంధీ, ఇతర కాంగ్రెస్ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

దిశ, వెబ్ డెస్క్: ప్రధాని మోడీ నివాసం వద్ద మరోసారి ఉద్రిక్తత నెలకొంది. నీట్ పేపర్ లీక్ పై విద్యార్థులకు మద్దతు ఇస్తూ ప్రధాని నివాసాన్ని ముట్టడించిన రాహుల్ గాంధీ, ఇతర కాంగ్రెస్ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిరసన కార్యక్రమంలో రాహుల్ గాంధీతో పాటు ఖర్గే, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్ సైతం ఉన్నారు. వీరంతా చేతులకు సంకెళ్లు వేసుకుని మోడీ రాజీనామా చేయాలి, కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ ఆందోళన చేపట్టారు. రాత్రి తరవాత కూడా రాహుల్, కాంగ్రెస్ నాయకులు తమ నిరసన కొనసాగించాలని భావించారు.
కానీ ఇంతలో పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని అక్కడ నుండి తరలిస్తున్నారు. మరోవైపు కేంద్రం తరపున కేంద్రమంత్రి కేంద్రమంత్రి జితేంద్రసింగ్ రాహుల్ గాంధీతో చర్చలు జరపగా ఆయన ముందు కాంగ్రెస్ ఐదు డిమాండ్లను పెట్టింది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. అదే విధంగా నీట్ పై పార్లమెంట్ లో చర్చ జరగాలని, పేపర్ లీక్ పై హోంమంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేసింది. వీటితో పాటు నీట్ పేపర్ లీక్ తో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని, విద్యార్థులపై జరిగిన హింసపై విచారణ జరిపించాలని పట్టుపట్టింది.






